ఎందుకు దూరంగా ఉంటుంది చెప్మా..?

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మహానటి మూవీ మే 9 న విడుదలై సెన్సేషన్ క్రియేట్ చెయ్యడమే కాదు… సూపర్ హిట్ కలక్షన్స్ తో దూసుకుపోతుంది. కీర్తి సురేష్ సావిత్రి పాత్రలో చక్కటి అభినయం అందంతో ఆకట్టుకుంది. అయితే ఈ సినిమాలో కీర్తి సురేష్ తర్వాత అంతగా పేరొచ్చింది, నటుడు జెమిని గణేశన్ పాత్రలో నటించిన దుల్కర్ కి…. ఆ తర్వాత మాత్రం మహానటి సావిత్రి గురించి చెప్పే జర్నలిస్ట్ మధురవాణి పాత్ర చేసిన సమంతకి గొప్ప పేరొచ్చింది. ఇక మహానటి సినిమా విడుదలకు ముందు కీర్తి సురేష్ తో పాటు సినిమాకి తెగ పబ్లిసిటీ చేసింది సమంత. తానే సినిమాకి హీరోయిన్ అన్న టైప్ లో.

ఇక సినిమా విడుదలై సూపర్ హిట్ అవడం, సినిమాలో నటించిన కీర్తి సురేష్ కి సూపర్ పేరు రావడం, అలాగే నిర్మతలు, డైరెక్టర్ నాగ్ అశ్విన్ ని అందరూ పొగిడెయ్యడం జరిగింది. పరిశ్రమలోని అందరూ మహానటి సినిమాని పొగిడిన వారే కానీ పొగడని వారు లేరంటే నమ్మాలి. అయితే మహానటి విడుదలకు ముందు సమంత తన కో స్టార్ విజయ్ దేవరకొండ తో కలిసి మహానటి సినిమా ని ఎంతగా పబ్లిసిటీ చేసిందో… సినిమా విడుదలయ్యాక మాత్రం మహానటిని సమంత పట్టించుకోవడం మానేసిందనే చెప్పాలి. ఎందుకంటే మహానటి సక్సెస్ మీట్ కి గాని, మహానటి సక్సెస్ ఇంటర్వూస్ కి గాని. ఆఖరికి మహానటి టీమ్ అమరావతి వెళ్లి ఏపీ సీఎం చంద్రబాబు ని కలిసి అమరావతి నిర్మాణానికి గాను 50 లక్షల చెక్ ఇవ్వడం లో కూడా సమంత ఎక్కడా కనబడలేదు. అలాగే మహానటి టీమ్ ని చంద్రబాబు సత్కరించాడు కూడా.

అయితే శుక్రవారం పొద్దున్న మహానటి సక్సెస్ మీట్ లో పాల్గొనకుండా తప్పించుకున్న సమంత శుక్రవారం రాత్రి తాను కోలీవుడ్ లో విశాల్ తో కలిసి నటించిన అభిమన్యుడు సినిమాని తెలుగులో విడుదల చేస్తున్నందున ఆ సినిమా రిలీజ్ ప్రెస్ మీట్ కి మాత్రం వచ్చింది. మరి పొద్దున్న దొరకని తీరిక సమంత కి అభిమన్యుడు పబ్లిసిటీ కి మాత్రం వచ్చిందా అనే కామెంట్స్ పడుతున్నాయి. ఇకపోతే మహానటి అమరావతి సత్కారానికి సమంత రాకపోవడానికి సమంత తనకి షూటింగ్ ఉందని మహానటి టీమ్ కి చెప్పిందట. మరి సమంత తన కెరీర్ లో ఎప్పుడూ ఇలా చెయ్యలేదు. మరి ఇప్పుడెందుకు ఇలా ఎందుకు చేసిందో గాని పాపం సమంత మీద అందరికి నెగెటివ్ వైబ్రేషన్స్ వెళుతున్నాయి

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*