ఎన్టీఆర్ ‘అసామాన్యుడు’ కాదు

ఎన్టీఆర్ Junior NTR రామాయణ

ఎన్టీఆర్ హీరోగా డైరెక్టర్ త్రివిక్రమ్ రాయలసీమ నేపథ్యంలో ఓ సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ కి జోడిగా పూజా హెగ్డే నటిస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను దసరాకి రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు. కానీ ఏ డేట్ అన్నది ఇంకా ఫైనలైజ్ చేయలేదు.

ఈ సినిమాకి ‘అసామాన్యుడు’ అనే టైటిల్ ను త్రివిక్రమ్ పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే ఆ టైటిల్ కి ఫ్యాన్స్ నుండి సినిమా యూనిట్ నుండి బ్యాడ్ ఫీడ్ బ్యాక్ రావడంతో త్రివిక్రమ్ మరో టైటిల్ అనుకున్నట్టు తెలుస్తుంది. కథను..అందులోని కొత్తదనాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాకి ‘రా రా కుమారా’ అనే టైటిల్ ను అనుకుంటున్నట్టు సమాచారం.

ఈ టైటిల్ కు మంచి రెస్పాన్స్ రావడంతో త్రివిక్రమ్ ఈ టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు టాక్. ఈ నెల 20వ తేదీన ఎన్టీఆర్ పుట్టినరోజు .. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, రేపు ఈ టైటిల్ ను అధికారికంగా ప్రకటిస్తూ ఫస్టులుక్ ను రిలీజ్ చేస్తారని చెబుతున్నారు. తమన్
ఇప్పటికే రెండు సాంగ్స్ కంపోజ్ చేసాడంట. మిగిలిన సాంగ్స్ కు ట్యూన్స్ చేసే పనిలో ఉన్నాడు తమన్

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*