ఎయిర్ హోస్ట్రెస్ గా కనిపించనున్న మిల్కీ బ్యూటీ

తమన్నా భాటియా

మిల్కీ బ్యూటీ తమన్నా తెలుగు చిత్ర పరిశ్రమలో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, తారక్, రామ్ చరణ్ తేజ్, ప్రభాస్, రవితేజ వంటి స్టార్ హీరోస్ అందరితో కలిసి నటించగలిగింది కానీ ఇంత కాలంలో తన సక్సెస్ రేట్ ని మాత్రం పెంచుకోలేకపోయింది. స్టార్స్ తో చేసిన చిత్రాలలో తమన్నా కి కలిసొచ్చింది కూడా ఏమి లేదు పాపం. ఆగడు, కెమెరా మాన్ గంగ తో రాంబాబు, బద్రీనాథ్, ఊసరవెల్లి, రెబల్ వంటి చిత్రాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. అయితే మిల్కీ బ్యూటీ బాలీవుడ్ వెళ్లి అక్కడ కూడా స్టార్ హీరోస్ సినిమాలలో అవకాశాలు అయితే దక్కించుకోగలిగింది. అజయ్ దేవగన్ సరసన హిమ్మత్వాల, సైఫ్ అలీ ఖాన్ సరసన హంషకల్స్, అక్షయ్ కుమార్ సరసన ఎంటర్టైన్మెంట్ సినిమాలలో నటించిన తమన్నా కి ఒక్క కమర్షియల్ సక్సెస్ కూడా దక్కలేదు.

రాజమౌళి దర్శకత్వంలో ప్రపంచ వ్యాప్త గుర్తింపు పొందిన బాహుబలి చిత్రంలో అవంతిక పాత్రలో కనిపించిన తమన్నా కి ఇప్పుడు రాబోతున్న బాహుబలి ది కంక్లూషన్ సినిమా తప్ప చెప్పుకోదగ్గ ప్రాజెక్ట్స్ ఏమి లేవు. ప్రస్తుతం బాహుబలి కి వున్నా బజ్ కారణంగా బాలీవుడ్ లో ఒక్క సక్సెస్ కూడా లేనప్పటికీ జాన్ అబ్రహం సరసన చోర్ నికాలకే బాగా అనే చిత్రంలో నటించే అవకాశం దక్కించుకుంది మిల్కీ బ్యూటీ. అమర్ కౌశిక్ దర్శకత్వంలో రాజ్ కుమార్ గుప్తా నిర్మాణంలో రూపొందబోయే ఈ చిత్రంలో జాన్ అబ్రహం పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషిస్తుండగా మిల్కీ బ్యూటీ ఎయిర్ హోస్ట్రెస్ పాత్రలో కనిపిస్తుందని తెలుస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*