ఓ యువకుడి ప్రపోజల్ కు ఫిదా అయిన తాప్సీ

టాలీవుడ్ లో దర్శకేంద్రుడి ‘ఝుమ్మంది నాదం’ సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ అయింది తాప్సీ పన్ను. తెలుగులో ఎన్ని సినిమాలు చేసిన మంచి గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. ఇక్కడ ఆఫర్స్ తగ్గటంతో బాలీవుడ్ పై కన్నేసింది. ఆమధ్య రాఘవేంద్రరావుపైన కామెంట్ చేసి తెలుగు వారి కోపానికి కూడా గురైంది.

ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ స్టేటస్ ని ఎంజాయ్ చేస్తున్న తాప్సీ తాజాగా ఓ యువకుడు రాసిన ప్రేమలేఖను చదివి ఫిదా అయిపోయిందట. ‘మందు ముట్టనూ మాంసం ముట్టనూ… అన్నింటికంటే ముఖ్యంగా నేను వర్జీన్నీ… నీ మీద నాకున్న ప్రేమను నిరూపించేందుకు నార్కొటిక్ పరీక్షకైనా లై డిటెక్టర్ పరీక్షకైనా నేను సిద్ధమే. నా మెదడును పూర్తిగా పరీక్షించడం మాత్రం మరవద్దు…’ అంటూ ఇమెయిల్ లో ఆ యువకుడు తాప్సీ కి పోస్ట్ చేసాడు. ఈ ప్రపోజల్ తాప్సీకి బాగా నచ్చడంతో తన అకౌంట్లో షేర్ చేసింది.

బెస్ట్ ప్రపోజల్ ఎవర్ అంటూ ఆ ప్రపోజల్ ను పోస్ట్ చేసింది ఏ సొట్టబుగ్గల సుందరి. ఇంతకీ ఈ ప్రపోజల్ తాప్సీకు నచ్చిందో.. లేదో.. మరి. ఇక లేటెస్ట్ గా ‘జుడ్వా 2’ లో నటించి ఆ చిత్రంలో బికినీ తో అందరి ద్రుష్టి ఆమె వైపు తిప్పుకుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*