కీర్తి ఆఫర్ కొట్టేసిన సీనియర్ హీరోయిన్?

కీర్తి సురేష్

మహానటి తర్వాత కీర్తి సురేష్ బాలీవుడ్ లోకి అజయ్ దేవగన్ మైదాన్ సినిమాతో ఎంట్రీకి ఏర్పాట్లు జరిగాయి. ఒక్కసారిగా తెలుగు, తమిళ, బాలీవుడ్ సినిమాల్తో బిజీ తారగా మారిన కీర్తి సురేష్ ఇప్పుడు బాలీవుడ్ ఆఫర్ ని వదులుకుంది . కారణం ఆమె అజయ్ దేవగన్ భార్య పాత్రలో మైదాన్ లో కనిపించాలి. అయితే అంత సీయర్ హీరో ముందు కీర్తి సురేష్ మరీ యంగ్ గా సన్నగా కనిపించడంతో.. ఇప్పటివరకు జరిగిన షూటింగ్ రషెస్ చూసిన కీర్తి సురేష్.. అతను అజయ్ పక్కన మరీ తేలిపోయానని..అందుకే కీర్తి సురేష్ నిర్మాత బోని తో సంప్రదించి మరీ ఈ సినిమా నుండి తప్పుకున్నట్లుగా బాలీవుడ్ మీడియా కథనం. మహానటి తర్వాత బాగా సన్నగా నాజూగ్గా మారిన కీర్తికి ఇప్పుడు ఆమె బరువు తగ్గడం శాపంగా మారింది.

అయితే కీర్తి సురేష్ మైదాన్ నుండి బయటికి రావడంతో.. అజయ్ దేవగన్ భర్య రోల్ కి ఇప్పుడు సీనియర్ హీరోయిన్ ప్రియమణి చెంతకి చేరింది. ఇప్పటికే బాలీవుడ్ లో ఒకటి అరా పాత్రలతో కెరీర్ లో ముందుకెళుతున్న ప్రియమణి తాజాగా ద ఫ్యామిలీ మెన్ వెబ్ సీరీస్ తో ఇరగదీసింది. ఇక కీర్తి సురేష్ మైదాన్ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో అజయ్ సరసన ప్రియమణి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందని.. చిత్ర బృందము ఆమెని సంప్రదించడం ప్రియమణి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగాయనే టాక్ బాలీవుడ్ ఫిలింసర్కిల్స్ లో వినబడుతుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*