కొడకాతో కోసేస్తున్నాడు…?

పవన్ కళ్యాణ్ – త్రివిక్రం కలయికలో వస్తున్న అజ్ఞాతవాసి సినిమా హడావిడి స్టార్ట్ అయ్యింది. మొన్నటికి మొన్న టీజర్ తో ఆడియో సాంగ్స్ తో హలచల్ చేసిన అజ్ఞాతవాసి కొన్ని రోజులు ఎటువంటి హడావిడి లేకుండా నిన్న శనివారం అజ్ఞాతవాసి వర్కింగ్ ఫోటో స్ తోపాటు… ఈ రోజు ఆదివారం పవన్ కళ్యాణ్ గొంతు సవరించిన “కొడకా కోటేశ్వరరావు” అనే పాటతో పాటు… ఆ పాట పాడిన పవన్ కళ్యాణ్ వీడియో ని కూడా విడుదల చేశారు.

పవన్ కళ్యాణ్ పాడిన ఆ పాటను అజ్ఞాతవాసి ఆడియో వేడుకలో విడుదల చెయ్యకుండా ఇయర్ ఎండింగ్ పవన్ ఫాన్స్ కి ఫుల్ జోష్ నిచ్చేందుకు గాను డిసెంబర్ 31 న ఈ పాటను విడుదల చేసింది చిత్ర బృందం. మరి నిజంగానే పవన్ పాడిన ఆ పాట విజువల్స్ చూస్తుంటే కేవలం పవన్ ఫాన్స్ మాత్రమే కాదు సాధారణ ప్రేక్షకులకి పూనకాలు వచ్చేస్తున్నాయి. పవన్ పాట పాడిన స్టయిల్, పవన్ మ్యానరిజమ్, సరదాగా నవ్వులతో సాగిన ఈ పాట ని త్రివిక్రమ్, అనిరుద్, అజ్ఞాతవాసి నిర్మాత చిన్నబాబు… లిరికిస్ట్ భాస్కర భట్ల సమక్షంలో పవన్ ఆలపించాడు. పవన్ స్టయిల్ తో పడిన ఈ పాట మాత్రం యువతని ఉర్రుతలూగించేస్తుంది.

అత్తారింటికి దారేదిలో పవన్ పాడిన కాటమరాయుడా పాట ఎంతగా పాపులర్ అయ్యిందో.. ఇపుడు ఈ అజ్ఞాతవాసిలో కొడకా కోటేశ్వరా అనే పాట కూడా ఖచ్చితంగా అంతే హైలెట్ అవుతుంది అనడంలో సందేహమే లేదు. ఇక కీర్తి సురేష్, అను ఇమ్మాన్యువల్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా జనవరి 10 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*