చిత్రీకరణ మాత్రమే పూర్తయిందట…!

కమల్ హాసన్

కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ లో వుండిపోయిన చిత్రం లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన విశ్వరూపం 2 చిత్రం. అప్పుడప్పుడు కమల్ హాసన్ ప్రెస్ మీట్ లు నిర్వహించి ఈ చిత్రం విడుదలకి సిద్ధంగా వుంది అని చెప్పి ఏదో ఒక రిలీజ్ డేట్ చెప్పటం, ఆ డేట్ కి చిత్రం విడుదల కాకపోవటం షరా మామూలు అయిపోవటంతో ప్రేక్షకులు కూడా ఈ ప్రెస్ మీట్లని పట్టించుకోవటం మానేశారు. అయితే ఈ మధ్య కాలంలో లేటెస్ట్ గా ఇచ్చిన ఒక ప్రెస్ ఇంటర్వ్యూ లో కమల్ చాలా కాన్ఫిడెంట్ గా జనవరి 26న విడుదల చేస్తున్నామని చెప్పటంతో కొద్దిగా ఆశలు చిగురించాయి కానీ యథావిధిగా ఈ సారి కూడా ఆయన నిరాశపరిచారు.

డబ్బింగ్ దశలోనే…

ఆరా తీయగా తెలిసొచ్చింది ఏమిటంటే కమల్ హాసన్ ఇంత కాలం విడుదలకి సిద్ధంగా వుంది అని చెప్తున్నా విశ్వరూపం 2 ఇంకా నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకోలేదు. చిత్రీకరణ మాత్రమే పూర్తి కాబడిన ఈ చిత్రం ప్రస్తుతం డబ్బింగ్ దశలో వుంది. అనంతరం సౌండ్ మిక్సింగ్ కార్యక్రమాలు హాలీవుడ్ టెక్నిషియన్స్ తో విదేశాలలో చూపించటానికి ప్లాన్ చేస్తున్నారు కమల్ హాసన్. కాబట్టి ఈ చిత్రం పై ఇంకెన్ని ప్రకటనలు వచ్చినా కూడా ఇది ఇప్పట్లో విడుదల అయ్యే చిత్రం కాదన్నమాట.

Ravi Batchali
About Ravi Batchali 30886 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*