చిరు ఎంత ఛార్జ్ చేస్తున్నాడో తెలుసా.!!

సైరా

చిరంజీవి రీఎంట్రీ మూవీ ‘ఖైదీ నెంబర్ 150 ‘ని రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్ బ్యానేర్ పై నిర్మించాడు. ఇక ఆ చిత్రం అనూహ్య విజయం సాధించి కలెక్షన్స్ వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్ తాను నిర్మించిన మొదటి చిత్రానికే ఎక్కువగా లాభాలు ఆర్జించేసాడు. చిరు 150 వ చిత్రం ‘ఖైదీ నెంబర్ 150 ‘ 105 కోట్ల షేర్ సాధించినట్లు చెబుతున్నారు. అయితే కొడుకు నిర్మాణంలో నటించడంతో చిరు రెమ్యునరేషన్ గురించి ఇప్పటివరకు ఎక్కడా పెద్దగా వినబడలేదు. అసలు చిరు తన కమ్ బ్యాక్ మూవీ ‘ఖైదీ…’ చిత్రానికి రెమ్యునరేషన్ గా ఎంత తీసుకున్నాడో ఎవ్వరికి తెలియదు. అయితే రామ్ చరణ్ దగ్గర నుండి చిరంజీవి తన రెమ్యునరేషన్ కింద దాదాపు 33 కోట్లు తీసుకున్నాడనే టాక్ బయటికి వచ్చింది.

అయితే చిరంజీవి తన రెమ్యునరేషన్ ని తన కొడుకు రామ్ చరణ్ దగ్గర నుండి ఎలా తీసుకున్నాడో కూడా ప్రచారం జరుగుతుంది. ‘ఖైదీ నెంబర్ 150 ‘ చిత్రానికి పెట్టిన బడ్జెట్ కంటే ఈ చిత్రం లాభాలే ఎక్కువగా వున్నాయట. మరి చిరు స్టామినా ఏంటో ఈ చిత్రంతో పూర్తిగా అర్ధమయ్యింది. అంతేకాదు తొమ్మిదేళ్ల తర్వాత చిరు స్క్రీన్ మీద ఎలా ఉంటాడో అనే క్యూరియాసిటీ తోనే చాలామంది ఈ చిత్రాన్ని చూసారు. ఇక ఎదిఎలాగున్నా ‘ఖైదీ…’ చిత్రం మాత్రం దాదాపు 50 కోట్ల పైబడే లాభాలు ఆర్జించింది చెబుతున్నారు. మరి వచ్చిన లాభాల నుండే చిరంజీవి తన రెమ్యునరేషన్ 33 కోట్లు తీసుకున్నాడని అంటున్నారు. అంటే చిరు రెమ్యునరేషన్ పోగా చరణ్ కి 20 కోట్లు పైబడి ఖైదీ… చిత్రానికి మిగిలిందన్నమాట.

అందుకే చరణ్ బాగా తెలివిగా అలోచించి తన తండ్రి చిరు 151 వ చిత్రాన్ని కూడా తానే నిర్మిస్తానని అన్నాడు. ఒకసారి లాభాల ఆర్జన అనుభవించాక దాన్ని ఎవరైనా కాదనుకుంటారా. ఇక ఇప్పటిదాకా టాలీవుడ్ లో 33 కోట్ల రెమ్యునరేషన్ ఏ హీరో తీసుకోలేదు..అంటే చిరు 33 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుని టాలీవుడ్ లో అత్యధిక పారితోషకం తీసుకున్న హీరోగా చరిత్ర సృష్టించాడన్నమాట.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*