చైతు గొప్ప అవకాశానికి దూరం అవుతున్నాడే

అక్కినేని నాగ చైతన్య తమ కుటుంబ సమేతంగా నటించిన మనం చిత్ర విజయం తప్ప ఈ మధ్య కాలంలో సోలో హీరోగా ఆశించిన స్థాయి ఫలితాలు అందుకోలేకపోయారు. కానీ ఆయన తరపు నుంచి ప్రయత్న లోపం లేదనే విషయం స్పష్టంగా రుజువు చేశాయి ఆయన గత ఏడాది నటించిన రెండు అద్భుతమైన ప్రేమ కథలు ప్రేమమ్, సాహసం శ్వాసగా సాగిపో. మాతృక భాషలో ప్రేమమ్ చిత్రాన్ని ఆస్వాదించేసిన తెలుగు ప్రేక్షకులు చైతు నటించిన ప్రేమమ్ కి మంచి మార్కులే ఇచ్చారు కానీ విజయ శిఖరాల చెంతనే నిలిపివేశారు కానీ శిఖరం ఎక్కించలేదు. విడుదల ప్రణాళిక లో అనుభవ లేమి కారణంగా సాహసం శ్వాసగా సాగైపో చిత్రం ప్రేక్షకాధరణకి నోచుకోలేదు కానీ నటుడిగా చైతు స్థాయి చాటే చిత్రాలలో ఒకటిగా నిలిచిపోతుంది.

దానితో కమర్షియల్ సక్సెస్ కోసం తపిస్తున్న నాగ చైతన్య సోగ్గాడే చిన్ని నాయనా ఫేమ్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో కుటుంబ సమేతంగా చూడ దగిన ప్రేమ కథ, ఫామిలీ డ్రామాల మేళవింపుగా తెరకెక్కుతుంది రారండోయ్ వేడుక చూద్దాం. ఈ చిత్రం విడుదల అనంతరం గౌతమ్ వాసుదేవ్ మీనన్ నిర్మాణంలో నగర సూరన్ అనే తమిళ చిత్రంలో చైతు కథానాయకుడిగా నటించాల్సి వుంది. దుఱువంగల్ పతినారు(తెలుగులో 16 ఎవ్రి డీటెయిల్ కౌంట్స్)తో అసాధారణమైన విజయం అందుకున్న యువ దర్శకుడు కార్తీక్ నరేన్ చెప్పిన కథకి ముగ్ధుడైన గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఈ ప్రాజెక్ట్ ని నాగ చైతన్య హీరోగా అనౌన్స్ చేశారు. అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కటానికి మరి కొంత సమయం పెట్టె అవకాశాలు ఉండటంతో, అప్పటికి ఇతర తెలుగు సినిమాలకి ఒప్పందాలు కుదుర్చుకున్న చైతు కి డేట్స్ క్లాష్ అయ్యే అవకాశం ఉండటంతో చిత్రీకరణ షెడ్యూల్స్ వాయిదా పడితే నగర సూరన్ ప్రాజెక్ట్ నుంచి చైతు తప్పుకోనున్నాడనే టాక్ వినిపిస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*