డైరెక్టర్స్ ని ఇబ్బంది పెడుతున్న ప్రభాస్!

Prabhas

బాహుబలి ముందు ప్రభాస్ వేరు బాహుబలి తర్వాత ప్రభాస్ వేరు. బాహుబలి సినిమాతో ఇండియా మొత్తం పాపులర్ అయ్యాడు ప్రభాస్. తనకు వచ్చిన గుర్తింపును బేస్ చేసుకుని తన తర్వాత సినిమాలను ప్లాన్ చేసుకుంటున్నాడు ఈ హీరో. అందుకే ప్రభాస్ తో సినిమా చేయడానికి తెలుగు డైరెక్టర్స్ ఏ కాదు.. వేరే బాషా వాళ్లు కూడా ట్రై చేస్తున్నారు.

అయితే లేటెస్ట్ గా ఓ రుమౌర్ ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతుంది. ప్రభాస్ డైరెక్టర్స్ ని ఇబ్బందిపెడుతున్నాడనే టాక్ బాగా ఎక్కువగా వినిపిస్తోంది. నిజానికి బాహుబలి తర్వాత సిట్యుయేషన్ ను ప్రభాస్ ఊహించి ఉండడు. అందుకే తన తర్వాత సినిమా ‘సాహో’ ను మొదట తెలుగు స్క్రిప్ట్ గానే ప్రిపేర్ చేయించాడు. కానీ బాహుబలి 2 కి వచ్చిన క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని ‘సాహో’ సినిమాను బిగ్ కాన్వాస్ పై మూవీ చేయాలనీ.. ఇండియన్ ఆడియన్స్ మొత్తానికి నచ్చేలా ఈ సినిమా ఉండాలి ప్రభాస్ డైరెక్టర్ కి చెప్పిన మాట వాస్తమే.

తన దగ్గరకు వచ్చే డైరెక్టర్స్ ని కూడా మల్టీ లాంగ్వేజ్ కి అనువుగా స్టోరీలు ప్రిపేర్ చేయమని కోరుతున్న మాట కూడా నిజమే. అయితే ప్రభాస్ చెప్పేదాంట్లో తప్పేముంది… తనకు మార్కెట్ ఉంది కాబ్బట్టి.. తనపై అంచనాలు ఉన్నాయి కాబట్టి వాటిని అందుకోవడానికి ట్రై చేస్తున్నాడు. దానికే ఇబ్బంది పెడుతున్నాడు అంటే ఎలా? ఇలా ప్రచారం చేయటం సరికాదు అని సినీ పండితులు చెబుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*