తొలిసారి కూతురి డెబ్యూ పై పెదవి విప్పిన స్టార్ హీరో 

ఈ నెల 24 న విడుదల కాబోతున్న రంగూన్ చిత్రంపై ఇప్పటికే దేశ వ్యాప్తంగా అంచనాలు భారీగా పెరిగిపోయాయి. పీరియాడిక్ హిస్టరీ జోనర్లో తెరకెక్కిన రంగూన్ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్- కంగనా రనౌత్ ల మధ్య రొమాన్స్ సన్నివేశాలు హైలైట్ గా నిలవనున్నాయని తెలుస్తుంది. రంగూన్ విడుదల కోసం ప్రేక్షకులతో పాటు తాను కూడా చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నానని చెప్పిన సైఫ్ అలీ ఖాన్ తాను నటించిన చిత్ర వివరాలతో పాటు ఇప్పటి వరకు ఎప్పుడూ పెదవి విప్పని విషయాలపై కూడా మనసు విప్పి మీడియా మిత్రులతో పంచుకున్నాడు. ఈ ఇంటర్వ్యూ లో తన కూతురు సారా అలీ ఖాన్ పరిచయ చిత్రం ఎప్పుడూ వుండబోతోంది అని అడిగిన ప్రశ్నకు సరైన తేదీ ప్రకటించినప్పటికీ పరోక్ష సమాధానం ఇచ్చి సరిపెట్టాడు సైఫ్ అలీ ఖాన్.
దాదాపు ఏడాది కాలంగా శ్రీదేవి తనయురాలు జాన్వీ కపూర్ తెరాన్గ్రేటం తో పాటు సారా అలీ ఖాన్ తెరాన్గ్రేటం పైకూడా అనేక ఊహాగానాలు చోటుచేసుకుంటుండగా ఇప్పుడు సారా పరిచయ చిత్రంపై ఒక స్పష్టత ఇచ్చాడు సైఫ్. “సారా అలీ ఖాన్ తొలి చిత్రం కరణ్ జోహార్ నిర్మాణంలో తెరకెక్కుతుంది. ఆ చిత్రం అతి త్వరలో లాంచ్ కానుంది. ఇప్పటికే స్టార్స్ వారసులని లాంచ్క చేయటానికి కరణ్ జోహార్ గోల్డెన్ హ్యాండ్ అయ్యారు. కరణ్ జోహార్ కి యాక్టర్స్ నుంచి రాబట్టుకోవాల్సిన పర్ఫార్మెన్స్ విషయం నుంచి స్టార్ కాస్టింగ్, స్టోరీ జడ్జ్మెంట్, బడ్జెట్ ప్లానింగ్ ఇలా అన్ని విషయాలలో పూర్తి అవగాహన ఉండటంతో సారా పరిచయం చిత్రం ఆయన నిర్మాణంలో పూర్తి బాధ్యతను ఆయన పై పెట్టేసాను. సారా పరిచయ చిత్రం స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ కి సీక్వెల్ అవుతుందో లేక కరణ్ జోహార్ వేరే కథ ఎంపిక చేస్తారో నాకు ఇంకా తెలీదు.” అని వివరించాడు సైఫ్ అలీ ఖాన్.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*