దువ్వాడతో దున్నేస్తున్నాడు!!

అల్లు అర్జున్ బ్రాహ్మణ అవతారంలో కనబడుతున్న ‘దువ్వాడ జగన్నాథం’ డీజే టీజర్ ని మహా శివరాత్రి సందర్భం గా విడుదల చేశారు. ఇప్పటికే బ్రాహ్మణ లుక్ లో ఫస్ట్ లుక్ తోనే ఆకట్టుకున్న అల్లు అర్జున్ ఇప్పడు ఫస్ట్ టీజర్ తోనే దున్నేస్తున్నాడు. ఈచిత్రంలో అల్లు అర్జున్ కి జోడిగా ‘ముకుంద’ భామ పూజ హెగ్డే నటిస్తుంది. ‘గబ్బర్ సింగ్’ వంటి సూపర్ హిట్ చేసాక మళ్ళీ అంతటి హిట్ కోసం హరీష్ శంకర్ ఈ ‘డీజే’ చిత్రాన్ని మలుస్తున్నాడు. ఇక ఫస్ట్ లుక్ టీజర్ లో అల్లు అర్జున్ పవర్ ఫుల్ బ్రాహ్మణ యువకుడిగా వళ్ళంతా విభూది నామాలతో, రుద్రాక్షలతో బాగా ఆకట్టుకుంటున్నాడు. ఇక ఈ టీజర్ లో ఆలు అర్జున్ మొదటగా దేవుని మందిరంలో విభూది తో నామాలు పెట్టుకుంటూ దేవుడికి హారతిస్తూ అచ్చమైన బ్రాహ్మణుడిలా వున్నాడు. ఇక అల్లు అర్జున్ ని అలా పద్ధతిలా చూపించి హీరోయిన్ పూజ హెగ్డే ని మాత్రం చాలా గ్లామర్ గా చూపించాడు దర్శకుడు. ఇక పూజ అందాల ఆరబోతతో ఈ సినిమాలో బాగా రెచ్చిపోతుందనే క్లూని ఇచ్చేసారు. ఇక ఈ టీజర్ లో అల్లు అర్జున్ ని పూజ హెగ్డే బలవంతం గా ముద్దుపెట్టగా దానికి అల్లు అర్జున్ ‘ఇలా ముద్దులు పెట్టేసి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామంటూ’ చెప్పే ఒక్క డైలాగ్ తోనే సినిమా మీద హైప్ క్రియేట్ చేసేసారు. అయితే అల్లు అర్జున్ ఈ బ్రాహ్మణ వేషం వెయ్యడం వెనుక ఒక పెద్ద స్టోరీ ఉన్నట్లు మనకు ఈ టీజర్ చూస్తుంటే అర్ధమవుతుంది. పవర్ ఫుల్ బ్రాహ్మణుడిగా కనిపిస్తున్న అల్లు అర్జున్ ఏదైనా సాధించడం కోసం ఇలా బ్రాహ్మణుడిగా మారాడా…. అని అనిపించక మానదు. మరి సినిమా విడుదల వరకు మనకు క్లారిటీ రావాలంటే కొంచెం వెయిట్ చెయ్యక తప్పదు. ఇక ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీ ప్రసాద్ అందిస్తుండగా… నిర్మాత దిల్ రాజు. ఈ చిత్రాన్ని వచ్చే వేసవికి విడుదల చెయ్యాలనే కసితో వున్నారు చిత్ర యూనిట్.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*