నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ అందుకున్న సీనియర్ హీరోయిన్

1991 నుంచి 2002 వరకు 11 సంవత్సరాల పాటు నిర్విరామంగా వెండితెరపై కథానాయికగా మెరిసి అభిమానులని ఉర్రూతలూ ఊగించిన సీనియర్ కథానాయిక మమతా కులకర్ణి ఎక్కువగా తన కెరీర్ హిందీ మరియు బెంగాలీ చిత్రాలతో సాగించినప్పటికీ తమిళ, కన్నడ ప్రేక్షకులతో పాటు ప్రేమ శిఖరం మరియు దొంగా పోలీస్ చిత్రాలతో మమతా కులకర్ణి తెలుగు ప్రేక్షకులకి కూడా పరిచయమే. కథానాయికగా ఫేడ్ అవుట్ అయిపోయి ఇప్పటికే 15 సంవత్సరాలు గడిచిపోయిన అనంతరం ప్రస్తుతం తన 44 సంవత్సరాల వయసులో డ్రగ్ మాఫియా తో సంబంధమున్న ఆరోపణలతో నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ అందుకుని వార్తల్లో నిలిచింది మాజీ యాక్ట్రెస్ మమతా కులకర్ణి.

మమతా కులకర్ణి అస్సాం రాష్ట్రానికి చెందిన విక్కీ గోస్వామి అనే వ్యక్తిని వివాహమాడింది. అయితే విక్కీ గోస్వామి వారి వివాహం జరగటానికి చాలా సంవత్సరాల క్రితమే అస్సాం నుంచి గుజరాత్ రాష్ట్రానికి వచ్చేసి అక్కడే స్థిరపడ్డాడు. విక్కీ గోస్వామి కి దుబాయ్-నేపాల్ కేంద్రంగా డ్రగ్స్ సప్లై చేసే వ్యాపారం ఉండేది. అతనిని వివాహమాడిన అనంతరం మమతా కులకర్ణి కూడా డ్రగ్స్ కి బాగా బానిస అయిపోయారు. కాగా వీరు సాగిస్తున్న డ్రగ్స్ స్మగ్లింగ్ వ్యవహారం గుట్టు 2014 లో రట్టు కాగా అప్పటి థానే పోలీస్ వారు వీరిపై కేసు నమోదు చేసి విచారణ జరుపగా అప్పటికి విక్కీ గోస్వామి పోలీస్ వారి విచారణకు సహకరించకుండా తప్పించుకుని అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. రెండు సంవత్సరాల పాటు విచారణ జరిపిన పోలీసులు విక్కీ గోస్వామితోపాటు మమతా కులకర్ణి పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేఇంచి ఈ దంపతుల కోసం గాలిస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*