‘నిన్ను కోరి’… అంటున్న నాని!!

మంచి కుటుంబ కథా చిత్రాలు, ప్రేమకథలతో వరుస హిట్సనందుకుంటున్న నాని తాజాగా నివేత థామస్, ఆది పినిశెట్టిలతో కలిసి ‘నిన్ను కోరి’ అంటూ ప్రేక్షకులముందుకు అతి త్వరలోనే రాబోతున్నాడు. అయితే ఇప్పుడు ప్రేక్షకులను ఎంటర్టైన్ చెయ్యడానికి ‘నిన్ను కోరి’ థియేట్రికల్ ట్రయిలర్ తో వచ్చేసాడు. ఈసారి కూడా నేచురల్ లవ్ స్టోరీ తోనే ఆకట్టుకోవడానికి రెడీ అయిన నాని ట్రైలర్ లో ఎప్పటిలాగే మంచి ఎమోషనల్ సీన్స్ తో మంచి కామెడీ పంచ్ లతో ఇరగదీసేసాడు. ఈ ట్రైలర్ చూసిన వారికి ఇదొక ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని అర్ధమైపోతుంది.

నాని మరియు నివేద థామస్ లు డీప్ లవర్స్ అని ట్రైలర్ చూస్తుంటే తెలుస్తుంది. కానీ వీరి లవ్ లోకి ఆది పినిశెట్టి ఎంటర్ అవడమూ…లవ్ లో సెకండ్ ఛాన్సు ఉండదు అనుకునే నివేత……. నీ సంతోషమే ముఖ్యం అనుకునే ఆది పినిశెట్టి…. తనతోనే చావో బ్రతుకో అనుకున్న నాని…. ఇలా ఎమోషనల్ గా.. కామెడీగా…. పంచ్ డైలాగ్స్ తో…. గంభీరమైన వాతవరణం అన్నికలగలిసిన ‘నిన్ని కోరి’ ట్రైలర్ టోటల్ గా బాగానే ఆకట్టుకుంటుంది. నాని ఇదివరకటిలాగే సూపర్బ్ పెరఫామెన్స్ తో చంపేశాడు. ఇక ఆది, నివేత లు కూడా తమ స్టయిల్లో బాగానే మెప్పించారు.

గోపి సుందర్ అందించిన మ్యూజిక్.. అలాగే సినిమాటోగ్రాఫీ ఈ ‘నిన్ను కోరి’ చిత్రానికి హైలెట్ అనడానికి సందేహం లేదు. నూతన దర్శకుడు శివ నిర్వణా తెరకెక్కించిన ఈ చిత్రం జులై లో ప్రేక్షకులను అలరించడానికి రాబోతుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*