నిర్మాతను భారీగా ముంచేసిన మంచు వారి అబ్బాయి….!

Manchu Manoj

మంచు మనోజ్‌ కెరీర్‌లో ఇప్పటి వరకు నిఖార్సైన హిట్‌ లేదు. కాకపోతే ఎక్కువగా తన సొంతబేనర్‌లో సినిమాలు చేస్తూ రావడంతో ఈ విషయంలో ఎవరికీ గొడవ లేకుండా పోయింది. అయితే తాజాగా దశరథ్‌ దర్శకత్వంలో మనోజ్‌ నటించిన ‘శౌర్య’ చిత్రం ఏకంగా 700 థియేటర్లలో విడుదలైంది. అయితే ఈ సినిమాకు రెండో షో నుండే థియేటర్లు ఖాళీ అయిపోయాయి. ఇక ఓవర్‌సీస్‌లో కూడా ఈ చిత్రం భారీగానే రిలీజైంది. కానీ అక్కడ రెండో రోజునే థియేటర్లలోంచి ఈ సినిమాను తీసివేశారు. ఈ చిత్రం దాదాపు 10కోట్ల బడ్జెట్‌తో రూపొందినట్లు సమాచారం. దశరథ్‌ దర్శకుడు కావడంతో ఎంతో కొంత నమ్మకంతో ఈ చిత్రాన్ని బయ్యర్లు కొన్నారు. కానీ ఈ చిత్రానికి పెట్టిన పెట్టుబడిలో 75శాతం వరకు నష్టాలు వస్తాయని, ఈ చిత్రాన్ని కొన్నవారు కూడా భారీగా నష్టపోయారని ట్రేడ్‌వర్గాల సమాచారం. మొత్తానికి ఈ చిత్రాన్ని మనోజ్‌ కెరీర్‌లోనే భారీ డిజాస్టర్‌గా చెప్పుకొంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*