పాపం అమల ని అందరూ అపార్ధం చేసుకున్నారు

amala paul

తమిళ మళయాళ భాషలలో తన సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస అవకాశాలు దక్కించుకుంటున్న డస్కీ బ్యూటీ అమల పాల్ తన విడాకుల అనంతరం సోషల్ మీడియాలో ప్రధాన టాపిక్ అయిపోయింది. విడాకుల అనంతరం ఎన్నడూ లేనిది పలు మ్యాగజాయిన్ కవర్ పేజెస్ కోసం ఇచ్చిన హాట్ ఫోటో షూట్లు, తన సొంత పేజెస్ పై పోస్ట్ చేసుకున్న కొన్ని హాట్ ఫొటోస్ అమల పాల్ ని వరుసగా ప్రేక్షకుల దృష్టిలో వుంచుతూనే వున్నాయి. ఇదిలా ఉండగా ఇప్పుడు తాజాగా అమల పాల్ ఒక వ్యక్తికి బుగ్గపై ముద్ధు పెట్టిన ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిపోయింది. ఈ ఫోటో వెనుక వాస్తవాలు ఎవరికీ తెలియకపోయినా పలు కామెంట్స్ ని నమ్మిన నెటిజన్లు అతగాడు అమల పాల్ కొత్త బాయ్ ఫ్రెండ్ అనే అనుకున్నారు.

సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఒక్క ఫోటో మాత్రమే పరిగణలోకి తీసుకున్న వారంతా ఆ ఫోటోకి ముందు, వెనుక పొందుపరిచిన ఒక పెద్ద ఆల్బమ్ నే ఇప్పుడు చూసి నాలుక కరుచుకుంటున్నారు. కేరళ లో పుట్టి పెరిగిన అమల పాల్ తన ప్రాణ స్నేహితుడికి తన ప్రేయసితో వివాహం కుదరటంతో ఆత్మీయమైన విషెస్ చెప్పటానికే ప్రయత్నించిందని వాస్తవాన్ని గ్రహించారంతా. ఆ ఫొటోతో మరికొన్ని ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. తన స్నేహితుడి వివాహ వేడుకకి హాజరైన అమల పాల్ చీర కట్టుకుని నుదుట బొట్టు పెట్టుకుని సాంప్రదాయబద్దంగా కనిపించిన దృశ్యాలు, మరో వైపు కొత్త పెళ్లి జంట ఫోటో అందరి అనుమానాల్ని తీర్చేసింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*