పెళ్ళైనా ఎక్కడా తగ్గడం లేదు

samantha

సమంత పెళ్లయ్యాక కూడా నటిస్తానని మొహమాటం లేకుండా చెప్పెయ్యడమే కాదు… సమంతని పెళ్లాడిన నాగ చైతన్య కూడా సమంతకి మెళ్ళో తాళి తప్ప మిగతా లైఫ్ అంతా సేమ్ టు సేమ్ అని చెప్పేసాడు. మరి సమంత పెళ్లి తర్వాత అక్కినేని కోడలిగా కొంచెం పద్దతిగా మారుతుంది అని చాలామంది ఎక్సపెక్ట్ చేశారు. కానీ సమంత ఇదివరకు ఎలా ఉందొ అలానే ఉంది. అసలు ఇదివరకు కాస్త పద్దతిగా ఉందేమో… కానీ ఇప్పుడు మాత్రం అందాల ఆరబోతలో ఆరితేరిపోయినట్లుగా కనబడుతుంది. పెళ్లయిన కొత్తలో కొంచెం పద్దతి గల అమ్మాయిగా అక్కినేని కోడలిగా కనబడినా… ఇప్పుడు మాత్రం చాలా బోల్డ్ గా అందాలు ఆరబోస్తుంది.

ఆలా ఇలాంటి హొట్నెస్ కాదు…. ఏకంగా బికినీ షో చేస్తుంది సామ్. ఇప్పుడు తాజాగా చాలా రోజులు షూటింగ్ అంటూ పనితో అలిసి పోయాను. వెకేషన్ అనేది కోరిక కాదు అవసరం అంటూ.. బికినీ వేసుకుని బీచ్ ఒడ్డున జనాల మతులు పోగొడుతుంది. మరి టు పీస్ బికినీతో సమంత అలా హాట్ లుక్ తో కనబడుతుంటే… అబ్బా సామ్ పెళ్ళైనా ఏం మారలేదు అంటున్నారు. మరోపక్క అదేమిటి సామ్ పెళ్ళై అంత పెద్ద ఇంటి కోడలైనా ఇలా బికినీ వేసుకోవడం ఏమిటి అంటూ పెదవి విరుస్తున్నారు.

కానీ సమంత అలాంటి వారికి ఇలాంటి బికినీస్ తోనే సమాధానం చెబుతుంది. అది అందరికి తెలిసిందే. మరి సమంత ప్రస్తుతం రంగస్థలం షూటింగ్ తోనూ, మహానటి షూటింగ్ తోనూ, అలాగే తమిళనాట చేతినిండా సినిమాలతోను పిచ్చ బిజీగా పని చేస్తూ అలసిపోయి అందరికి దూరంగా ఇలా సేద దీరుతూ… తానేం చేస్తున్నది.. ఇలా అభిమానులతో పంచుకోవడం మాత్రం ఆనందిందానిస్తుంది అంటున్నారు సామ్ అభిమానులు.

Samantha-In-Bikini-1518086209-103

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*