ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ అంటున్న సూపర్ స్టార్!!

మహేష్ – మురుగదాస్ చిత్రం మొదలై చాలాకాలం అయ్యింది. ఇక ఈ సినిమా షూటింగ్ కూడా దాదాపు పూర్తికావస్తోంది. అయినా షూటింగ్ కంప్లీట్ చేసుకుంటున్నా కూడా ఈ సినిమాకి సంబంధించి టైటిల్ గాని ఫస్ట్ లుక్ గాని దర్శకుడు మురుగదాస్ ఇంతవరకు రివీల్ చెయ్యలేదు. అదిగో ఫస్ట్ లుక్… ఇదిగో టైటిల్ ఎనౌన్సమెంట్ అని అంటున్నారే గాని ఇంతవరకు అవి విడుదల చేసే తేదీల గురించి ఎక్కడా బయటికి రావడం లేదు. అసలు మహేష్ కొత్త చిత్రం ఫస్ట్ లుక్ కోసం ఘట్టమనేని అభిమానులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారనే విషయం ఒక్క మహెష్ కే కాదు మురుగదాస్ కి కూడా తెలుసు. అయితే ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో బైలింగ్యువల్ గా రూపొందించడం వల్ల షూటింగ్ కి విరామం లేకుండా పని చెయ్యడం కారణం గా ఫస్ట్ లుక్ ని విడుదల చెయ్యడంలో జాప్యం జరిగిందని అంటున్నారు.

ఇక ఇప్పుడు మహేష్ కొత్త చిత్రానికి ఫస్ట్ లుక్ టీజర్ ని రెడీ చేసారని చెబుతున్నారు. 35  సెకెన్స్ నిడివిగల ఈ టీజర్ ని ప్రత్యేకంగా యూకేలో రెడీ చేయిస్తున్నాడట మురుగదాస్. ఈ టీజర్ తో మహేష్ ఫ్యాన్స్ తో  పాటు అందరూ మహేష్ లుక్ సూపర్ అనేలా టీజర్ ని రెడీ చేయించాడట మురుగదాస్. అలాగే టైటిల్ విషయంలో కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. ఫస్ట్ లుక్ టీజర్ తోపాటు టైటిల్ ని కూడా రివీల్ చేస్తారని టాక్.  మహేష్ సినిమా టైటిల్ సంభవామి అంటూ ఆ మధ్యన తెగ ప్రచారం జరిగింది. మరి అదే టైటిల్ ని పెడతారో లేక్ వేరే టైటిల్ ని అనౌన్స్ చేస్తారో అనేది తెలియాల్సి వుంది. అయితే ఇప్పటివరకు ఈ టైటిల్ కి సమబంధించిగాని, టీజర్ విడుదలకు సంబంధించిగాని డేట్ అయితే నిర్ణయించలేదు. కానీ అతి త్వరలోనే మహేష్ చిత్రానికి సంబందించి ఎనౌన్సమెంట్ ఉంటుందని అంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*