బాలీవుడ్ క్వీన్ ని రాణి లక్ష్మి బాయ్ గా చూపబోతున్న క్రిష్

krish next movie in tollywood

గమ్యం నుంచి గౌతమీపుత్ర శాతకర్ణి వరకు ప్రతి సారి వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులకు చేరువ అవుతున్న సృజనాత్మక దర్శకుడు క్రిష్ మధ్యలో బొంబాయి వెళ్లి గబ్బర్ ఈజ్ బ్యాక్ అంటూ బాలీవుడ్ ప్రేక్షకులకి కూడా తన నైపుణ్యత చూపించాడు. గౌతమీపుత్ర శాతకర్ణి తో తెలుగు యోధుడి చరిత్ర ని చాటి చెప్పిన క్రిష్ కి ఇప్పుడు బాలీవుడ్ నుంచి చారిత్రాత్మక కథలని హేండిల్ చేయవలసినదిగా పలు అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం బాలీవుడ్ లో సంజయ్ లీల బన్సాలి తప్పించి ఇతర దర్శకులెవరూ చారిత్రాత్మక కథలతో ప్రేక్షకులని అలరించలేకపోతున్నారు. కాగా క్వీన్ చిత్రం నుంచి ప్రతి చిత్రంతోనూ తన నటనతో విమర్శకుల నోర్లకు తాళాలు వేస్తున్న కంగనా రనౌత్ కొంత కాలం కిందట తనకి రాణి లక్ష్మి బాయ్ పాత్ర డ్రీం ప్రాజెక్ట్ గా మిగిలిపోయింది అని, త్వరలోనే ఆ పాత్ర పోషించాలనుకుంటున్నట్టు ప్రకటించింది.

ఇలాంటి ప్రకటన ఒకటి చేసి దర్శక రచయితల కోసం ఎదురు చూడకుండా తానే స్వయంగా చరిత్ర పుస్తకాలని అధ్యయనం చేసుకుని రాణి లక్ష్మి బాయ్ స్క్రిప్ట్ పనులు మొదలు పెట్టింది కంగనా రనౌత్. అయితే ఆ స్క్రిప్ట్ ఒక రూపం తీసుకోకముందే ఇతర కమిట్మెంట్స్ వల్ల హోల్డ్ లో పెట్టిన కంగనా కి కేతన్ మెహతా నుంచి రాణి లక్ష్మి బాయ్ పాత్ర పోషించమని ఆఫర్ రావటంతో కేతన్ మెహతా సిద్ధం చేసిన స్క్రిప్ట్ ఫైనల్ అనుకున్నారంతా. కానీ అనుకోకుండా ఆ ప్రాజెక్ట్ కూడా పట్టాలెక్కలేదు. ఇక ఇప్పుడు విజయేంద్ర ప్రసాద్ చొరవతో క్రిష్ చేసిన గౌతమీపుత్ర శాతకర్ణి చూపించారు కంగనాకు. ఈ చిత్రం కంగనా కి బాగా నచ్చటంతో క్రిష్ తెరకెక్కించబోయే మణికర్ణికా చిత్రంలో రాణి లక్ష్మి బాయ్ పాత్ర పోషించటానికి కంగనా రనౌత్ ఉత్సాహం చూపిస్తున్నట్టు తెలుస్తుంది. రాణి లక్ష్మి బాయ్ మరో పేరు మణికర్ణికా. ఈ చిత్రం బైలింగువల్ గా తెరకెక్కే అవకాశాలు వున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*