బొంబాయి వీధుల్లో షాపింగ్ చేస్తున్న మలైకా

నటిగా, నిర్మాతగా, ప్రత్యేక గీతాలకు చిరునామాగా వివిధ స్థాయిల్లో సినిమా రంగానికి తన జీవితాన్ని అంకితం చేసిన మలైకా అరోరా ఖాన్ ఈ మధ్య కాలంలో ఆన్ స్క్రీన్ అప్పీరెన్స్ లు తగ్గించినప్పటికీ గత ఏడాది తన భర్త అర్బాజ్ ఖాన్ తో విడాకులు కోసం కోర్ట్ మెట్టులు ఎక్కి హెడ్ లైన్స్ లో నిలిచింది. ఎట్టకేలకు చట్టపరంగా కూడా అర్బాజ్ ఖాన్ తో వైవాహిక బంధం నుంచి విముక్తి చెందిన తరువాత మలైకా అరోరా బాగా స్వేచ్ఛగా కనిపిస్తోంది. తన స్టార్ స్టేటస్ ని, ఇంత కాలం తాను మోసిన బాధ్యతలని వదిలేసి సామాన్య స్త్రీ గా జీవిస్తునట్టుగా అనిపిస్తుంది. బాలీవుడ్ లోని కొందరు ప్రముఖులైతే ఏకంగా విడాకుల అనంతరం మలైకా అరోరా వైరాగ్యాన్ని పొందిందని కామెంట్స్ చేసేస్తున్నారు.

మలైకా అరోరా లో వీరంతా అకస్మాత్తు మార్పులు ఏమి చూసుంటారో మనకి తెలీదు కానీ, తాజాగా అమ్మడు చేసిన ఒక షాపింగ్ మాత్రం నిజంగానే తాను కాపాడుకుంటూ వచ్చిన స్టార్ స్టేటస్ ను వదిలించుకుందనే భావనను కలిగించేలానే వుంది. సినిమా తారలు ఎవరైనా బొంబాయి నగరంలోని జనాల రద్దీ ఎక్కువగా వుండే దుకాణాలలో తమ ఇంటికి కావలసిన వస్తువులని స్వయంగా వెళ్లి కొనుగోలు చేసే ధైర్యం చేయరు. నిత్యం వెండితెరపై చూసే ముఖాలను ఒకేసారి తమ మధ్యన చూస్తే అక్కడ అభిమానుల ఉధ్రిక్తతో ఏర్పడే తాకిడిని అదుపు చేయటం అసాధ్యం అని గ్రహించి ఈ సాహసానికి ఎవరూ ఒడికట్టరు. కానీ మలైకా అరోరా నిత్యం రద్దీగా వుండే బొంబాయి వీధులలో తన కార్ని ఆపి రోడ్ పక్కన వుండే చిన్న దుకాణాలలో షాపింగ్ చేసి అందరిని ఆశ్చర్య పరిచింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*