మంచి స్టయిల్లో స్టేట్మెంట్ ఇచ్చాడుగా…!!

సమంత – నాగ చైతన్య నిశ్చితార్ధ వేడుక నిన్న రాత్రి హైద్రాబాద్లో అంగరంగ వైభవంగా కొద్దిమంది అతిధులు మధ్యన జరిగిపోయింది. ఇన్నాళ్లు ప్రేమ పక్షుల్లా విహరించిన చై – సామ్ ఇద్దరూ ఇప్పుడు ఆఫీసియల్ గా ఎంగేజ్మెంట్ చేసుకుని పెళ్ళికి సిద్ధమైపోయారు. ఇక ఈ వేడుకని నాగార్జున, అమల తమ చేతుల మీదుగా చేశారు. అయితే ఈ నిశ్చితార్ధం హిందూ, క్రైస్తవ సంప్రదాయాల్లో రెండు రకాలుగా జరుపుకున్నారు చై – సామ్ ఇద్దరూ. నాగ చైతన్య – సమంత పరస్పరం ఉంగరాలు మార్చుకుని…. చైతన్య, సమంతకి ఒక అందమైన ముద్దుతో ఇచ్చి తన సంతోషాన్ని పంచుకున్నాడు. ఈ వేడుకకి అఖిల్ తన కాబోయే భార్య శ్రీయ భూపాల్ తో హాజరయ్యాడు.

ఇక నాగార్జున వీరిద్దరి నిశితార్ధమవ్వగానే తన సంతోషాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. ‘ఇప్పుడు అధికారికం గా మా అమ్మే… నా కూతురయ్యిందని… ఇంతకుమించిన ఆనందం ఏముంటుందని’ మనం సినిమా డైలాగ్ స్టయిల్లో చెప్పాడు. ఇక అక్కినేని వారింట అఖిల్, నాగ చైతన్య పెళ్లి వేడుకలు మొదలై పోయినట్టే. ఇప్పటికే అఖిల్, శ్రియ భూపాల్ ని ఎంగేజ్మెంట్ చేసుకుని ఇటలీలో పెళ్ళికి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. ఇక నాగ చైతన్య కూడా సమంతతో ఎంగేజ్మెంట్ చేసుకుని పెళ్ళికి రెడీ అయిపోయాడు. ఒకే ఏడాదిలో అన్నదమ్ములిద్దరూ ఒక ఇంటివారు కాబోతుండడంతో నాగార్జున దంపతులు ఆనందానికి అవధుల్లేకుండా పోయానని సమాచారం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*