మణికర్ణికను చూసారా..!!

manikarnika collections

‘గౌతమీపుత్ర శాతకర్ణి’ వంటి చారిత్రక నేపథ్యం వున్నా కథను తెరకెక్కించిన డైరెక్టర్ క్రిష్ ఆ తర్వాత అలాంటి చారిత్రక సినిమాలు చెయ్యడానికి కొద్దిగా సమయం తీసుకుంటానని చెప్పాడు. కానీ బాలీవుడ్ లో ఝాన్సీ లక్ష్మి భాయి జీవిత కథతో సినిమా చెయ్యాలని డిసైడ్ అయిపోయాడు. ఈ చిత్రంలో ఝాన్సీ లక్ష్మి భాయి గా బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నటిస్తుంది. ఈ చిత్రానికి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ దాదాపు పూర్తి కావోస్తుందట. ఇక ఝాన్సీ లక్ష్మి భాయి బయో పిక్ ని ‘మణికర్ణికా’ అనే పేరుతొ తెరకెక్కిస్తున్నాడు క్రిష్.

ఝాన్సీ లక్ష్మి భాయ్ అసలు పేరు మణికర్ణిక. ఆమె ఝాన్సీ రాజును పెళ్లి చేసుకోక ముందు మాణికర్ణికగానే చెలామణి అయ్యింది. ఇక పెళ్ళయినాక ఝాన్సీ లక్ష్మి భాయి గా పేరుగాంచింది. ఇక ఝాన్సీ లక్ష్మి భాయి మీద చాలానే సీరియల్స్ వచ్చి పేరు బాగా వాడుకలో ఉండడంతో ఆమె అసలు పేరు ‘మణికర్ణిక’ పేరుతోనే ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు క్రిష్. ఆ ‘మణికర్ణిక’ ప్రీ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది.

ఇక ఈ చిత్రం లేడి ఓరియెంటెడ్ గా తెరకెక్కుతుంది కాబట్టి ఈ చిత్రం కోసం కంగనా రనౌత్ కట్టి యుద్ధంలో, గుర్రపు స్వారిలో శిక్షణ తీసుకుంటుంది. ఇక ఇప్పుడు వదిలిన ‘మణికర్ణిక’ ప్రీ లుక్ లో కంగనా ఝాన్సీ లక్ష్మి భాయి గా కంగనా బాగానే ఆకట్టుకుంటుంది. మరి ఈ చిత్రాన్ని ఎప్పుడు స్టార్ చేస్తాడో గాని క్రిష్ ఈ సినిమాపై మాత్రం అందరికి బాగా ఆసక్తి ఏర్పడిపోయింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*