మా ‘మీరా’ చిత్రాన్ని ఆదిరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు: చిత్ర యూనిట్

ఆదిత్య, నికిత, ఇషికలు హీరో హీరోయిన్లుగా ఉనికొ సినీ స్వ్వాడ్‌ పతాకంపై సంతోష్‌ యూబులుస్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ గాజుల్లా కుమార్‌, గాజుల్లా రమేష్‌లు నిర్మించిన చిత్రం ‘మీరా’. ఈ చిత్రం ఇటీవల మార్చి 25న విడుదలై ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ..మా చిన్న చిత్రాన్ని ఇంత అద్భుతంగా ఆదరిస్తున్నందుకు మేము ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మా దర్శకుడు సంతోష్‌ యాబులుస్‌ ఈ చిత్ర కథ, కథనాలను చాలా అద్భుతంగా తెరకెక్కించాడు. ‘హృదయకాలేయం’ ఫేమ్‌ ఇషిక ఈ చిత్రంలో చాలా అద్భుతమైన పాత్ర పోషించింది. ఇషిక పాత్రను మా దర్శకుడు తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. మంచి సస్పెన్స్‌ థ్రిల్లర్‌ చిత్రమిది. ఈ లోకం లో ఎవరూ చేయని ఒక నీచమైన పనిని ఆమె చేసింది అనే ఆసక్తిరమైన అంశంతో ‘మీరా’ తెరకెక్కింది. హీరో ఆదిత్య పాత్రను ప్రేక్షకులు బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు. కొత్తవాడైనా కూడా తన పాత్రకు ఆదిత్య పూర్తి న్యాయం చేశాడు. ఇలాంటి మంచి నటులను తెలుగు సినిమా దర్శకనిర్మాతలు ఎప్పుడూ ప్రోత్సహించాలని కోరుకుంటున్నాం..అని అన్నారు.
దర్శకుడు సంతోష్‌ యాబులుస్‌ మాట్లాడుతూ…ముందుగా ఈ చిత్రానికి దర్శకుడిగా అవకాశం ఇచ్చిన మా నిర్మాతలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ మూవీ సాధించిన విజయం దర్శకుడిగా నా స్థాయిని పెంచింది. అద్భుతమైన స్క్రీన్‌ప్లే..అని అందరూ అంటుంటే.దర్శకుడిగా ఒకడుగు ముందుకు వేశాననే భావన నాకు కలుగుతుంది. మంచి చిత్రాలకు తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు బ్రహ్మరథం పడుతూనే ఉంటారు. అది మరోసారి ఈ చిత్రంతో నిరూపించారు..అని అన్నారు.
ఆదిత్య, నికిత, ఇషిక, శ్రీధర్‌, సూర్యకుమార్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: చరణ్‌, ఎడిటింగ్‌: డి.ఎ. రాకేశ్‌ గౌడ్‌, నిర్మాతలు : గాజుల్ల కుమార్‌, గాజుల్ల రమేష్‌, కథ-స్క్రీన్‌ప్లే-సంగీతం- దర్శకత్వం: సంతోష్‌ యాబులుస్‌.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*