మెగాహీరోయిన్ కొంటెదనం, గడుసుతనం...!
కొణిదెల నిహారిక... బుల్లితెర ద్వారా, వెబ్ సీరియల్ ద్వారా, షార్ట్ ఫిలింస్ ద్వారా తనకంటూ ఓ ప్రత్యేకతను సృష్టించుకున్న మెగాడాటర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఆమె తొలిసారిగా వెండితెరపై హీరోయిన్గా నటిస్తున్న 'ఒక మనసుతో' విడుదల కాకుండానే ఆమె తన ప్రత్యేకతను చాటుకుంటోంది. ఇటీవల ఆమె ఓ ముఖాముఖిలో తన గడుసుతనం, సమయస్ఫూర్తి ప్రదర్శించింది. ఓ కొంటె అభిమాని ఫ్లయింగ్ కిస్ అడగగా, అంతకంటే కొంటెగా నేను ఫ్లయింగ్ కిస్ ఇస్తే అందులో నువ్వు కొట్టుకుపోతావు... నాకు అది ఇష్టంలేదు అంటూ తన సమయస్పూర్తిని ప్రదర్శించింది. ఇక తనకు రామ్‌చరణ్ అన్నయ్య గైడ్, ఫిలాసఫర్ అంటూ తన మనసులోని మాటను బయటపెట్టింది. పెదనాన్న మెగాస్టార్ చిరంజీవి చేయబోయే 150వ చిత్రంలో నటించాలని తన కోరికను వెల్లడించింది. కథ నచ్చితే ఎన్టీఆర్, అఖిల్‌లతో కలిసి నటిస్తానని పేర్కొంది. పెదనాన్న నటించిన 'జగదేకవీరుడు అతిలోకసుందరి', బాబాయ్ పవన్‌కళ్యాణ్ నటించిన 'జల్సా' చిత్రాలు తనకు బాగా ఇష్టమని తెలిపింది. మొత్తానికి ఒక్కసినిమా కూడా విడుదల కాకుండానే తన గడుసుతనం, మాటకారితనంతో ఆమె అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.