మెగా ఫ్యామిలీ కి బాగానే సోప్ వేస్తున్నాడే…!!

హరీష్ శంకర్ డైరెక్ట్ చేసిన ‘దువ్వాడ జగన్నాథం’ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం టాక్ ఎలా ఉన్నప్పటికీ మొదటి రోజు రికార్డు స్థాయిలో కలెక్షన్స్ కొల్లగొట్టడం ఖాయంగా చెబుతున్నారు. ఇకపోతే డీజే తర్వాత హరీష్ తన ఫోకస్ మొత్తం మళ్ళీ తన దేవుడు పవన్ కళ్యాణ్ మీదకి మరల్చాడు. ఒక్క పవన్ పై మాత్రమే కాకుండా అన్నగారు చిరంజీవి పై కూడా దృష్టి పెట్టాడు ఈ డైరెక్టర్ గారు. పవన్ అనుమతిస్తే పవన్ తో ఒక సినిమా చేస్తా… అలాగే చిరు గారితో సినిమా చెయ్యాలనే ఆలోచన కూడా వచ్చేసిందని చెబుతున్నాడు.

పవన్ కోసం ప్రస్తుతం కథ రెడీ చేస్తున్నా …. ఆయన కోసం నేను ఎప్పుడూ ఎదో ఒకటి ఆలోచిస్తా అని సోప్ వెయ్యడమే కాక చిరు గారితో కూడా ఒక సినిమా చెయ్యాలని ఉంది. ఆ సినిమాని ‘దొంగమొగుడు, రౌడీ అల్లుడు, గ్యాంగ్ లీడర్’ సినిమాలను మిక్స్ చేసి మరీ తీస్తా. ఎన్నో ఏళ్ళు నా సినిమా గురించి మాట్లాడుకునేలా ఆయనతో సినిమా తీస్తా అంటున్నాడు. మరి మెగా ఫ్యామిలీని ఇప్పట్లో వదిలే ఉద్దేశ్యం లేదని చిన్నగా తన ఆశను బయట పెట్టాడు హరీష్. మరి డీజే చిత్రం విజయపైనే మనోడి ఆశలు ఆధారపడి ఉంటాయని మనోడు మరిచిపోయినట్టున్నాడు.

మెగా హీరోలతోనే సినిమా తియ్యాలని ఉన్నప్పటికీ…. దిల్ రాజుగారితో మరో సినిమా కమిట్మెంట్ తో ప్రస్తుతానికి వేరే సినిమాలు ఒప్పుకోవడం లేదని… దిల్ రాజుగారికి నచ్చిన కథతోనే ఒక సినిమా చేస్తానని చెబుతున్నాడు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*