మొత్తానికి అక్కడ ఓకే అయింది…!

కొందరు హీరోయిన్స్‌ కెరీర్‌లు చాలా చిత్రంగా మొదలవుతాయి. కెరీర్‌ ప్రారంభంలో చాలా సినిమాలు మొదలయినా అవి ఆగిపోవడమో, లేదా మూలన పడటమో జరుగుతుంటాయి. స్టార్‌డమ్‌ వచ్చే వరకు ఏదీ నికరంగా ఉండదు.మోడలింగ్‌లో ఓ స్థాయికి చేరి సినిమా ఫీల్డ్‌లో దెబ్బలు తిని ఇప్పుడిప్పుడే నిలదొక్కుకునే ప్రయత్నాలు చేస్తోంది హీరోయిన్‌ ఆయేషాశర్మ. నేహాశర్మ చెల్లెలు అయిన ఈ భామ పూరీజగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందుతూ ఆగిపోయిన ‘రోగ్‌’ చిత్రంలో మొదట హీరోయిన్‌గా ఎంపికైంది. కానీ ఆ సినిమా ఆగిపోకముందే ఆమె ఈ చిత్రం నుండి తప్పుకుంది. ఈమెపై బ్యాంకాక్‌లో మొదటి షెడ్యూల్‌ షూటింగ్‌ కూడా జరిగింది. ఇక రామ్‌ హీరోగా వచ్చిన ‘శివం’ చిత్రంలో మొదట ఈమెనే హీరోయిన్‌గా తీసుకున్నారు. కానీ ఆ ప్రాజెక్ట్‌ నుండి కూడా తప్పుకుంది. కారణాలైతే తెలియదు కానీ ఇలా ఆమె నటించాల్సిన రెండు చిత్రాల్లో ఆమెకు ఎంట్రీ లభించలేదు. దాంతో ఆమె బాలీవుడ్‌కు వెళ్లి హాట్‌ హాట్‌ లుక్స్‌తో, బికినీలో రెచ్చిపోయి ఫొటో షూట్‌ చేసింది. ఈ ఫొటోలను, అమ్మడు హాట్‌ స్టిల్స్‌ను చూసిన ఆమెకు వరుణ్‌దావన్‌ హీరోగా నటిస్తున్న ‘జుద్వా2’లో హీరోయిన్‌గా ఎంపికైంది. మరి ఈ సినిమా అయినా పూర్తై విడుదల అవుతుందా? అనే దానిపై ఇప్పుడు ఈ అమ్మడు భవిష్యత్తు ఆధారపడివుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*