రంగస్థలంలో రామ్ చరణ్ ఎలా వున్నాడో చూసారా..?

రామ్ చరణ్ కొత్త చిత్రం టైటిల్ ‘రంగస్థలం 1985 ‘ అంటూ అనౌన్స్ చేసేసారు. సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న రామ్ చరణ్ రంగస్థలంలో సమంత హీరోయిన్. ఈ చిత్రం 1980 లలో పల్లెటూరి ప్రేమకథ అని… రామ్ చరణ్ దివ్యంగునిగా నటిస్తున్నాడని ఎప్పటినుండో ప్రచారంలో ఉన్న మాట. అయితే పల్లెటూరి వాతావరణం కోసం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం సంక్రాంతికి రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. ఈ చిత్రం ‘రంగస్థలం’ అని టైటిల్ ఎందుకు పెట్టారో తెలియదు గాని… రామ్ చరణ్ మాత్రం పక్కాపల్లెటూరి యువకుడిగా మాత్రం అదరగొడుతున్నాడు.

బెస్తవానిగా రామ్ చరణ్ ఈ చిత్రంలో నటిస్తున్నాడని చెబుతున్నారు. అయితే ఆ విషయం కరెక్ట్ గా తెలియదు గాని రామ్ చరణ్ లుంగీ కట్టుకుని… బనీను వేసుకుని బాగా ఓల్డ్ లుక్ లో ఆమద్యన లీకైన పిక్స్ లో కనబడ్డాడు. ఇప్పుడు కూడా అలాంటి లుంగినే కట్టుకుని… ఓల్డ్ లుక్ షర్ట్ తో రామ్ చరణ్ కనబడుతున్నాడు. అయితే ఆ లుక్ ‘రంగస్థలం’ సినిమా ఫస్ట్ లుక్ అనుకునేరు. కాదు కాదు… రాజమండ్రిలో షూటింగ్ జరిగే చోటు నుండి ఎవరో రామ్ చరణ్ లుంగిలో ఉన్న ఊరమాస్ లుక్ ని లీక్ చేశారు. ఇక ఈ లుక్ లో చరణ్ మాత్రం అలా పల్లెటూరి యువకుడి గెటప్లో అదిరిపోతున్నాడని మెగా ఫ్యాన్స్ ఆనందపడిపోతున్నారు.

అయితే సంక్రాంతికి విడుదల కానున్న ‘రంగస్థలం’ ఫస్ట్ లుక్ త్వరలోనే విడుదల చేస్తారని చిత్ర యూనిట్ చెబుతుంది. మరి త్వరగా మేలుకోకపోతే ఇంకా ఇలాంటి లీకెడ్ పిక్స్ ని ఎన్ని చూడాల్సి వస్తుందో…?

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*