రంగస్థలం ఆగేలా కనబడడం లేదే

telugu news

రంగస్థలం ట్రైలర్ విడుదలయిన దగ్గరనుండి ఆ సినిమా ముచ్చట్లే ఎక్కడ చూసినా… సినిమా విడుదలయ్యాక ఆ ముచ్చట్లు మరింత ఎక్కువయ్యాయి. సుకుమార్ దర్శకత్వం, రామ చరణ్ నటన, రామలక్ష్మి నటన లకు అందరూ బాగా కనెక్ట్ అవ్వడమే కాదు మళ్ళీ మళ్ళీ చూసేంతగా ఈ సినిమాని ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. ఈ సినిమా విడుదలైన దగ్గరనుండి కోట్లు కొల్లగొట్టేస్తూ అందరిని విస్మయానికి గురి చేస్తుంది. మరి ఈ సినిమా కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు… యూఎస్ లోను భారీ కలెక్షన్స్ తో కేక పుట్టిస్తుంది. రంగస్థలం గత శుక్రవారం విడుదలై.. ఈ వీకెండ్ ముగిసే సరికి 84 కోట్ల గ్రాస్ ను .. 50 నుండి 55 కోట్ల షేర్ ను సాధించి అదరగొట్టే కలక్షన్స్ రాబట్టి ఉరుకులు పరుగు పెడుతుంది.

మరి రంగస్థలానికి మైత్రి మూవీస్ పెట్టిన పెట్టుబడిలో 60 శాతం ఇప్పటికే కొల్లగొట్టేసి నిర్మాతల పాలిట వరంగా మరింది రామ్ చరణ్ రంగస్థలం. ఇక ఈ రంగస్థలం సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే 35 కోట్ల షేర్ ను వసూలు చేసి ఉండొచ్చనే అంచనాల్లో ట్రేడ్ నిపుణులు ఉన్నారు. మరి సినిమాలో పల్లె అందాలు, చరణ్ చిట్టిబాబుగా కనబర్చిన నటన, బలమైన కథాకథనాలు .. కొత్తగా అనిపించే పాత్రలు.. అంతేనా పల్లెటూరి వాతావరణానికి యాప్ట్ అయ్యే పాటలు, దేవిశ్రీ ఇచ్చిన మ్యూజిక్ అందరూ ఫిదా అవుతున్నారు. మరి ఇన్ని స్పెషల్స్ మధ్యన రంగస్థలం వసూళ్ల మోత మోగిపోతుందని అంటున్నారు.

మరి వీకెండ్ లోనే ఈ సినిమా కలెక్షన్స్ ఇలా వున్నాయి. ఇక సోమవారం నుండి కూడా ఈ సినిమా కలెక్షన్స్ లో దూకుడు తగ్గదని.. ఎలాగూ ఈ వీకెండ్ లో నితిన్ నుండి చల్ మోహన రంగ సినిమా ఒక్కటే బాక్సాఫీసు బరిలో నిలుస్తుంది. నితిన్ సినిమా చల్ మోహన్ రంగ మీద రంగస్థలం కి ఉన్నత అంచనాలు లేకపోవడం రంగస్థలం కలెక్షన్స్ ఇంకా పెరగడానికి కారణంఅవ్వొచ్చనే ఊహాగానాలు ఉన్నాయి. మరి రంగస్థలం సినిమాతో నిర్మాతలు ఎలా లేదన్న ఓ పది నుండి పదిహేను శాతం లాభాలు వెనకేసుకోవచ్చనే టాక్ కూడా ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*