రామ్ చరణ్ పై భారీ అంచనాలు

anasuya telugu post telugu news

రామ్ చరణ్ కు పర్ఫెక్ట్ మాస్ ఎంటర్టైనర్ వచ్చి చాలా కాలం అయింది. అయితే రంగస్థలంతో ఆ లోటు తీరిపోతుంది. ఈ చిత్రంలో వెరైటీకి లోటు లేదు. అలాగే మాస్‌ అంశాలు కూడా పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే సాంగ్స్ ఓ ఊపు ఊపుతున్నాయి.

ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చాలా గ్రాండ్ గా చేసారు. రామ్‌ చరణ్‌ ఇటీవలి చిత్రాల్లో ఈస్థాయి ప్రీ రిలీజ్‌ క్రేజ్‌ దేనికీ లేదంటే అతిశయోక్తి కాదు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఏమాత్రం పర్లేదు అని టాక్ వచ్చిన సినిమా అద్భుతాలని క్రియేట్ చేసే అవకాశంవుంది.

తెలుగు స్టేట్స్ తో పాటు ప్లానింగ్‌ సరిగ్గా వుంటే ఓవర్సీస్‌లో కూడా తొలి రోజు సూపర్‌ నంబర్లు చూడవచ్చునని ఫిక్స్‌ అయిపోవచ్చు. ఈ సినిమాతో రామ్ చరణ్ స్టార్‌డమ్‌ మళ్లీ ఈ చిత్రంతో కనిపిస్తూ వుండడంతో అభిమానుల్లోను ఆనందం ఉరకలేస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*