రామ్ చరణ్ ప్రాక్టీస్ చేస్తున్నాడా?

రామ్ చరణ్ ఉపాసనలకు 2012 లో వివాహం జరిగింది. పెళ్ళై ఆరేళ్ళు గడుస్తున్నా ఇప్పటివరకు వారికి పిల్లలు పుట్టలేదు. కారణం వారు కొన్నాళ్ల తర్వాతే పిల్లల్ని కనాలని ప్లాన్ చేసుకున్నారట. మరి చరణ్ తో పాటు పెళ్లి చేసుకున్న ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి వారు పిల్లల్ని కనేసి పరిపూర్ణమైన భర్త, తండ్రులుగా మారిపోయారు. కానీ చరణ్, ఉపాసనలు మాత్రం ఇంకా అలానే ఉండిపోయారు. అయితే అతిత్వరలోనే తాము పిల్లల్ని కంటామని చెబుతుంది ఈ మెగా జంట. ఈలోపు రామ్ చరణ్ పిల్లలతో ఎలా ఉండాలో అప్పుడే ప్రాక్టీస్ మొదలెట్టేసినట్టుగా కనబడుతున్నాడు.

ఎప్పుడు తమ అక్కల పిల్లల్తో ఎంజాయ్ చేసే చెర్రీ ఇప్పుడు ఉపాసన కజిన్స్ పిల్లల్తోనూ తెగ ఆడేసుకుంటున్నాడు. ప్రస్తుతం రంగస్థలం హిట్ తో ఫుల్ ఖుషీగా వున్న రామ్ చరణ్ చాలా హ్యాపీ మోడ్ లో ఉన్నాడు. మగధీర హిట్ తో ఇండస్ట్రీని షేక్ చేసిన రామ్ చరణ్ మళ్ళీ రంగస్థలంతో ఆ స్థాయి హిట్ కొట్టాడు. ఇక మెగా రంగస్థలం హిట్ మెగా ఫాన్స్ కూడా ఖుషీగా ఉన్నారు. ఇక రామ్ చరణ్ విషయాలన్నీ ఎప్పటికప్పుడు సోషల్ ఇండియాలో అభిమానులకు షేర్ చేసే ఉపాసన తాజాగా చరణ్ అండ్ ఉపాసనలు కలిసి ఉపాసన కజిన్ ఆదిత్య రెడ్డి ఫ్యామిలీతో రెస్టారెంట్ కు వెళ్లారు. అక్కడ ఆదిత్య రెడ్డి వాళ్ల పిల్లాడితో కలిసి చరణ్ తెగ హ్యాపీగా గడిపేశాడు. ఈ విషయాన్ని ఉపాసన సోషల్ మీడియాలో ద్వారా అందరికి తెలియజేసింది.

చరణ్ ఆదిత్య రెడ్డి పిల్లాడితో కలిసి ఉన్న హ్యాపీ మూమెంట్స్ ని సోషల్ మీడియా లో షేర్ చేసిన ఉపాసన ‘బేబీ సిట్టర్.. మిస్టర్ సీ’ అంటూ కామెంట్ కూడా పోస్ట్ చేసింది. మరి ఉపాసన ఆనందం, చరణ్ పిల్లలతో ఆడుకుంటున్న ఈ తీరు చూస్తుంటే మాత్రం రామ్ చరణ్ ఇప్పుడే తాను కనబోయే పిల్లల కోసం ప్రాక్టీసు మొదలెట్టేసినట్టుగా అనిపించడం లేదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*