రాయ్‌లక్ష్మీ ఈసారైనా రాణిస్తుందా…?

లక్ష్మీరాయ్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయన ఈ కన్నడ భామ మన ఆడియన్స్‌ను ఆకట్టుకోలేకపోయింది. అందం, గ్లామర్‌షోకు సై అన్నప్పటికీ ఆమెకు కాలం కలసి రాలేదు. కాగా ప్రస్తుతం రాయ్‌ లక్ష్మీగా పేరు మార్చుకున్న ఈ అమ్మడు పవన్‌కళ్యాణ్‌ నటిస్తున్న ‘సర్దార్‌గబ్బర్‌సింగ్‌’లో ఓ ఐటం సాంగ్‌లో చిందులేస్తోంది. కాగా ఈచిత్రం ద్వారా ఆమెకు బాలీవుడ్‌లో కూడా మంచి గుర్తింపు రావడం ఖాయమని అందరూ అనుకొంటున్న సమయంలో ఆమె ఈ చిత్రం ఇంకా విడుదలకాకముందే బాలీవుడ్‌లో ఓ బోల్డ్‌ మూవీలో అవకాశం దక్కించుకుంది. బాలీవుడ్‌లో శివదాసాని దర్శకత్వంలో రూపొందనున్న ‘జూలి2’ అనే శృంగారభరిత చిత్రంలో ఆమెకు అవకాశం వచ్చింది. గతంలో ‘జూలీ1’లో నేహాధూపియా నటించిన దాని కన్నా ఎన్నోరెట్లు అందాల ఆరబోతతో ఆమె బాలీవుడ్‌ ప్రేక్షకులను కట్టిపడేయనికి రెడీ అవుతోంది. ఇందులో ఆమె హాట్‌ హట్‌గా అందాల విందు చేయనుందని సమాచారం. మొత్తానికి ఇలాంటి శృంగార చిత్రంలో ఆమె తనకు అవకాశం రావడంతో మంచి జోరుమీదుంది. ఈ చిత్రం ఎలాగూ దక్షిణాదిలో కూడా విడుదల కావడం ఖాయం. దాంతో తానకు దేశవ్యాప్తంగా క్రేజ్‌ వస్తుందనే ఆశతో ఉంది. మొత్తానికి దేనికైనా రెడీ అనే రాయ్‌ లక్ష్మీ కెరీర్‌ను ఈ చిత్రం టర్న్‌ చేస్తుందనే ఆశతో ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*