లేనిపోని వివాదాలలో ఇరుక్కున్న అమల

కథానాయికగా తెలుగు, తమిళ, మళయాళ భాషలలో పలు సినిమాలు చేసి అతి చిన్న వయసులో వివాహం, విడాకుల అనుభవాలు చూసేసింది డస్కీ బ్యూటీ అమల పాల్. వాటితోపాటు కెరీర్ తొలి నాళ్ళ నుంచే ఏవో ఒక వివాదాలు నిత్యం అమల పాల్ ని వెంటాడుతూనే వున్నాయి. ఇప్పుడు కథానాయికగా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి తమిళ్ మరియు మళయాళ భాషలలో వరుస సినిమాలతో బిజీగా వున్న అమల పాల్, తన సెకండ్ ఇన్నింగ్స్ అట్టెంప్ట్స్ ప్రేక్షకుల ముందుకి వచ్చినప్పుడు తన ముఖం వారికి ఎబెట్టుగా అనిపించకూడదని ఇంత కాలం వచ్చిన గ్యాప్ ని తన హాట్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియా లో ఫిల్ చేస్తూ ప్రేక్షకులకి సెకండ్ ఇన్నింగ్స్ అనే ఫీల్ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది.

తన ఫోటో షూట్స్ ద్వారా అభిమానుల దృష్టిని ఆకర్షించటం ఒక అలవాటుగా మార్చుకున్న అమల పాల్ ఇప్పుడు తాజాగా తాను అప్లోడ్ చేసిన ఒక ఫోటో షూట్ ద్వారా పీకల్లోతు వివాదాలలో కూరుకుపోతోంది. తాను యోగాసనాలు వేసుకుంటున్న సమయంలో తీయబడ్డ ఫోటోలని సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది అమల పాల్. అయితే తాను యోగా చేసుకునే గదిలో గోడలకి గౌతమ బుద్ధుని ఫోటో వాల్ ఫాస్ట్గా ఉండటంతో అమల చేస్తున్న యోగాసనాలలో భాగంగా తన కాళ్ళు బుద్దిని తాకుతునట్టు కనిపిస్తున్నాయి. ఈ ఫోటో లోని దృశ్యానికి నొచ్చుకున్న బుద్ధిజం వక్తలు సోషల్ మీడియాలో అమల పాల్ పై విరుచుకు పడ్డారు. తక్షణమే ఈ ఫోటో లు తొలగించి క్షమాపణ తెలుపవలసినదిగా డిమాండ్ చేశారు. అయితే ఇప్పటి వరకు జరిగిన నష్టానికి సంజాయిషీ ఇవ్వటం కానీ ఫోటోలు డిలీట్ చెయ్యటం వంటివేమీ చెయ్యలేదు అమల పాల్. గతంలో భారత దేశపు జెండా వైపు కాళ్ళు పెట్టినందుకు టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా ఇలాంటి వివాదాలతోనే చిక్కుకుని చివరికి క్షమాపణ చెప్పవలసి వచ్చింది. అయితే అమల పాల్ ఈ ప్రక్రియని కూడా పబ్లిసిటీ కి వాడుకోవాలనుకుంటుంది కాబోలు. అందుకే ఇప్పటి వరకు రాచుకున్న వివాదానికి ఎలాంటి స్పందన తెలియజేయలేదు ఏమో.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*