వరుణ్ పక్కన కొత్త భామ?

varun tej remunaration

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ మాస్ మాస్ అంటూ మాస్ సినిమాల వెంట పడుతుంటే మరో మెగా హీరో వరుణ్ తేజ్ మాత్రం డీసెంట్ గా ప్రేమ కథా చిత్రాలతో హిట్ కొట్టుకుంటూ పోతున్నాడు. ఫిదా, తొలిప్రేమ వంటి హిట్స్ తో వరుణ్ తేజ్ ఇప్పుడు మంచి మార్కెట్ ని సెట్ చేసుకున్నాడు. ప్రేమ కథ చిత్రాలతో లవర్ బాయ్ లా మారిపోయిన వరుణ్ తేజ్ ఇప్పుడు మరో హిట్ ని తన ఖాతాలో వేసుకొనడానికి తహతహలాడుతున్నాడు. అందుకే ఈసారి సంకల్ప్ రెడ్డి తో కలిసి ఒక విభిన్న కథా చిత్రానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమా స్క్రిప్ట్ పనుల్లో ప్రస్తుతం సంకల్ప్ రెడ్డి బిజీగా వున్నాడు.

ఈ సినిమా మొత్తం స్పేస్ చుట్టూతా తిరగనుండడం, వరుణ్ తేజ్ కూడా వ్యోమగామిగా కనిపించడం, అలాగే బాలీవుడ్ భామ అదితి రావు వరుణ్ తేజ్ కి జోడిగా నటించడం వంటి విషయాలతో ఈ సినిమాపై మంచి అంచనాలు మొదలైపోయాయి. అయితే ఈ సినిమాకి సంబందించిన షూటింగ్ ఎక్కువశాతం నగర శివార్లలోని నిర్మిస్తున్న స్పేస్ సెంటర్ సెట్ లో జరగనుంది. ఈ సెట్ నిర్మాణం కూడా చాలా భారీగా జరుగుతుందట. అయితే వరుణ్ తేజ్ పక్కన ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటిస్తారట. అందులో ఒక హీరోయిన్ గా అతిధి ని తీసుకున్న చిత్ర బృందం.. ఇప్పుడు మరో హీరోయిన్ ని కూడా ఫైనల్ చేసిందని సమాచారం.

వరుణ్ పక్కన మరో హీరోయిన్ గా కావ్యా థాపర్ అనే కొత్తమ్మాయిని సెలెక్ట్ చేశారట. మరి కావ్యా థాపర్ సినిమాలకు కొత్త. వరుణ్ తేజ్ సినిమా ద్వారానే కావ్యా థాపర్ వెండితెరకు పరిచయం కాబోతుంది. ఇకపోతే ఈ సినిమాలో కీలకమైన సైంటిస్ట్ పాత్ర ప్రకాశ్ రాజ్ పోషించనున్నాడనే సమాచారం ఉంది. త్వరలోనే సెట్స్ మీదకెళ్లనున్న ఈ మూవీని ఈ ఏడాది చివరికల్లా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకుంటున్నారట.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*