వేసవిని దత్తత తీసుకున్న సమంత…!

samantha movie title

అదేమిటో గానీ స్టార్‌ హీరోయిన్‌ సమంత సినిమాలు కొన్నిసార్లు నెలల తరబడి రావు. వచ్చాయంటే మాత్రం వరసగా క్యూకట్టి వస్తుంటాయి. కాగా సమంత ఇప్పుడు సమ్మర్‌బేబీగా మారిపోయి సమ్మర్‌ను కూల్‌ చేయనుంది ఈ అందాల భామ. మొత్తానికి ఆమె ఏప్రిల్‌, మే నెలలు దత్తత తీసుకొంది. రెండు నెలల్లో ఆమె నటించిన నాలుగు భారీ చిత్రాలు విడుదలకు సిద్దమవుతున్నాయి. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ డైరెక్షన్‌లో నితిన్‌ సరసన ఆమె నటిస్తున్న ‘అ…ఆ’ చిత్రం మే6వ తేదీన విడుదలకు సిద్దమవుతోంది. ఇక మేనెలలో ఆమె మహేష్‌ సరసన చేస్తున్న ‘బ్రహ్మూెత్సవం’ చిత్రం తెలుగుతో పాటు తమిళంలో కూడా భారీ ఎత్తున విడుదలకానుంది. మరోవైపు ఆమె తమిళంలో స్టార్‌ విజయ్‌తో కలిసి నటిస్తున్న ‘తేరీ’ చిత్రం ఏప్రిల్‌ 14న తమిళ, తెలుగు భాషల్లో విడుదలకానుంది. మరోవైపు ఆమె విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో సూర్య హీరోగా నటిస్తున్న ’24’ చిత్రం కూడా ఇడే సమ్మర్‌లో తమిళంతోపాటు తెలుగులో కూడా గ్రాండ్‌గా రిలీజ్‌కు సిద్దమవుతోంది. అలాగే ఆగష్టులో ఆమె ఎన్టీఆర్‌ సరసన కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘జనతాగ్యారేజ్‌’ కూడా విడుదల కానుంది. కాగా ఆమె సమ్మర్‌లో నాలుగు చిత్రాలతో ఏడాది మొత్తం మీద ఐదారు చిత్రాలలో ప్రేక్షకులకు కనువిండు చేయనుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*