సంక్రాంతి హిట్ తో పారితోషికం పెంచేయటం వల్లే

ఈ ఏడాది సంక్రాంతి పండుగకి వచ్చిన నాలుగు సినిమాలలో మూడు సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. బాగా ఆడుతున్న ఈ మూడు చిత్రాలలో అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి అగ్ర కథానాయకులతో పోటీపడిన చిన్న చిత్రంగా నిలిచినా శతమానం భవతి గ్రాండ్ సక్సెస్ ఐన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఇప్పటికే యంగ్ హీరో శర్వానంద్ కి 20 కోట్ల క్లబ్లో సీట్ కంఫర్మ్ చేయగా, 25 కోట్ల క్లబ్ లోకి కూడా చేరే అవకాశాలు ఉన్నాయని బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇంతటి గ్రాండ్ సక్సెస్ఫుల్ సినిమాలో వన్ అండ్ ఓన్లీ హీరోయిన్ గా చేసిన అనుపమ పరమేశ్వరన్ గతంలో చేసిన రెండు తెలుగు సినిమాలు ప్రేమమ్, ఆ ఆ చిత్రాలలో ఇతర హీరోయిన్లతో కలిసి కనిపించటంతో ఆ చిత్రాలు సక్సెస్ అయినప్పటికీ ఫుల్ లెంగ్త్ ఫెమ్ అనుపమ పరమేశ్వరన్ కి దక్కలేదు. ఇప్పుడు శతమానం భవతి తో ఈ మలయాళ భామ కి ఆ గుర్తింపు వచ్చేయటంతో ఒక్కసారిగా పారితోషికం పై తన పట్టుదలని పెంచేసింది.

శతమానం భవతి విడుదలకి ముందుగానే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ సరసన నటించే అవకాశాన్ని దక్కించుకోగా, సుకుమార్ నేతృత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ మార్చ్ లో ప్రారంభం కానుండగా ఇప్పటికే యాక్టర్స్ అందరితో రిటన్ అగ్రీమెంట్స్ పూర్తయిపోయాయి. ఇప్పుడు శతమానం భావతితో వచ్చిన గుర్తింపుతో అనుపమ పరమేశ్వరన్ తన పారితోషికం 60 లక్షలకు పెంచేసింది. వీటికి తోడు ముందు నుంచి గ్లామర్ షో కి పెట్టిన షరతులను ఏ మాత్రం సడలించలేదు. దీనితో అంతా పారితోషికానికి మరో స్టార్ హీరోయిన్ ని తీసుకునే యోచనతో సుకుమార్ ప్రాజెక్ట్ నుంచి అనుపమ ని తప్పించగా, దిల్ రాజు-వేణు శ్రీ రామ్ ల ప్రాజెక్ట్ నుంచి ఇదే పారితోషికాల వ్యవహారం కొలిక్కి రాకపోవటంతో అనుపమ పరమేశ్వరన్ స్వయంగా వైదొలిగినట్టు సమాచారం. ఏది ఏమైనప్పటికి ఒక పక్క మెగా హీరో సరసన నటించే క్రేజీ ఆఫర్ తో పాటు సోలో హీరోయిన్ స్టేటస్ కలిపించిన దిల్ రాజు తదుపరి సినిమా నుంచి వైదొలిగి అనుపమ తన కెరీర్ ను తానే ట్రబుల్ లో పెట్టుకుంటుందని అభిప్రాయలు వినపడుతున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*