సమంత కోసం పోలీస్ లాఠీ ఛార్జ్

samantha

తమ అభిమాన తార తమ ముందుకు వస్తుంది అంటే అభిమానులకు పిచ్చ అభిమానం పుట్టుకొచ్చేస్తుంది. ఆ అభిమానం కొన్నిసార్లు వెర్రి తలలు వేసిన సందర్భాలు ఉన్నాయి. తమ అభిమాన హీరో సినిమా వస్తుంది అంటే చాలు.. చీకటిని సైతం లెక్కచెయ్యకుండా పెద్ద పెద్ద బ్యానర్లను కడుతూ హడావిడి చేస్తూ.. కొన్నిసార్లు ప్రమాదాలకు గురవుతూ ఉంటారు. ఇక తాము ఆరాధించే స్టార్స్ ఏదన్నా బట్టల కొట్టు గాని మరే ఇతర షాప్ లకు ఓపెనింగ్స్ కి వచ్చినా వారితో కలిసి ఫొటోస్ దిగడానికి…వారిని ఒక్కసారి తనివితీరా చూసుకున్నా జన్మ ధన్యమైపోతుంది అన్నట్లుగా అభిమానుల బిహేవియర్ ఉంటుంది.

అయితే ఈ అభిమానం అనేది సౌత్ లోనే ఎక్కువగా కనబడుతుంది. సౌత్ లోను అందులోను తమిళనాట క్రేజ్ ఉన్న స్టార్స్ ని ప్రజలు విపరీతంగా అభిమానించడమే కాదు గుడులు కట్టేసిన సందర్భాలు లేకపోలేదు. తెలుగులో కన్నా తమిళంలోనే చాలామంది స్టార్స్ కి అభిమానులుంటారు. అయితే తెలుగు అభిమానాన్ని చవిచూసిన తెలుగింటి కోడలు అక్కినేని సమంత తాజాగా తమిళ అభిమానాన్ని చవిచూసింది. తెలంగాణాలో చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేస్తోన్నా సామ్ తమిళనాడులో ఒక జ్యూయలరీ షాపునకు బ్రాండ్ అంబాసిడర్ గా పని చేస్తోంది. తాజాగా కృష్టగిరి పట్టణంలో ఆ సంస్థ ఓ బ్రాంచి ఏర్పాటు చేసింది. అయితే సమంత ఆ బ్రాంచిని ప్రారంభించేందుకు అక్కడికి రావడంతో సమంతని చూసేందుకు తమిళ ప్రజలు భారీ సంఖ్యలో వచ్చేశారు.

మరి అలా వచ్చినవాళ్లు సమంతను చూడాలనే ఉద్దేశ్యంతో ఆమె కారు చుట్టూ గుమిగూడేశారు. అభిమానుల తాకిడికి సమంత కారు ఇంచ్ కదిలితే వట్టు. దెబ్బకి పోలీసులు రంగంలోకి దిగి తమ లాఠీ పవర్ ఏంటో చూపిస్తే గానీ కారు ముందుకు కదలలేదు. మరి పెళ్లి చేసుకున్నాక కూడా సినిమాల్లో నటించే తరాలకు కాస్త డిమాండ్ తగ్గుతుంది. కానీ సమంతకున్న క్రేజ్ పెళ్లయ్యాక రోజురోజుకి పెరిగిపోతుంది. ఉదాహరణ మాత్రం ఈ సంఘటనే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*