సింగిల్ టేక్ లో అంత భారీ సీనా?

maheshbabu next movie story

వచ్చే శుక్రవారమే మహేష్ – కొరటాల శివల భరత్ అనే నేను సినిమా విడుదల కాబోతుంది. భరత్ అనే నేను సినిమాపై కేవలం ట్రేడ్ వర్గాల్లోనే కాదు… ప్రేక్షకుల్లోనూ అంచనాలున్నాయి. ఇక చిత్ర బృందం కూడా తమ సినిమాపై పూర్తి కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. చిత్ర బృందం ఎంతగా కాన్ఫిడెంట్ గా ఉన్నప్పటికీ భరత్ అనే నేను సినిమాని ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అనేది వారి ఊహకి అందడం లేదు. అంతలాంటి అంచనాలు భరత్ మీద ఉండడం తో చిత్ర బృందానికి నిమిష నిమిషానికి టెన్షన్ పెరిగిపోతుంది. టాలీవుడ్ ప్రేక్షకులు మహేష్ బాబు ని ఎంతవరకు సీఎం గా రిసీవ్ చేసుకుంటారో అనే దాని మీద కూడా వారికీ టెన్షన్ మొదలైందట.

ఈ భరత్ అనే నేను మొత్తం పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన సినిమా కనక ఇందులో శాసనసభకు సంబంధించి చాలా కీలకమైన సన్నివేశాలు ఉన్నాయట. ముఖ్యంగా ఏకబికిన 15 నిమిషాల పాటు వచ్చే ఒక ఎపిసోడ్ సినిమా మొత్తానికి హై లైట్ గా ఉండబోతోంది అని టాక్ ఇప్పటికే స్ప్రెడ్ అయ్యింది. అయితే ఆ 15 నిమిషాల ఎపిసోడ్ ని కేవలం ఒకే ఒక్క… అంటే సింగిల్ టేక్ లోనే అస్సలు గ్యాప్ అనేదే లేకుండా కొరటాల శివ షూట్ చెయ్యడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరి 15 నిమిషాలున్న ఇంత పెద్ద సీన్ ని సింగల్ టేక్ లో పూర్తి చేయటం అనేది దాదాపు అసాధ్యం. కానీ కొరటాల శివ ఈ లెన్తీ సీన్ ని ఛాలెంజ్ గా తీసుకుని మహేష్ బాబు ఇతర నటీనటులు టెక్నీషియన్స్ సహకారంతో పూర్తి చేసినట్టుగా తెలుస్తోంది.

ఇక ఈ సింగిల్ టేక్ ఎపిసోడ్ సినిమాకే హైలెట్ కాదు.. ఆ సీన్ మొత్తం మైండ్ బ్లోయింగ్ గా వచ్చిందట. ఇక భరత్ అనే నేను ట్రైలర్ లో వచ్చే ఒక సీన్ లో మహేష్ బాబు సభకు సెలవు చెప్పి ఇంటికి వెళ్ళాలి అనే చెప్పే డైలాగ్ ఒకటి ఉంటుంది. అది ఈ 15 నిమిషాల ఎపిసోడ్ తర్వాత వచ్చేదే అని వినికిడి. మరి ఇంత భారీ హైప్ తో భారీగా విడుదల కాబోతున్న భరత్ అనే నేను విజయం మీద మహేష్ బాబు కూడా భారీ ఆశలే పెట్టుకున్నాడు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*