సుక్కు చంపేస్తున్నాడు

సుకుమార్ – రామ్ చరణ్ కలయికలో తెరకెక్కుతున్న ‘రంగస్థలం 1985 ‘ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది. హైదరాబాద్ నడిబొడ్డున భూత్ బంగ్లా సమీపంలో వేసిన జాతర సెట్ లో ఈ చిత్ర షూటింగ్ జరుగుతుంది. ఆ జాతర సెట్ కూడా అలనాటి కాలం అంటే 1985 లో వాతావరణాన్ని తలపించేదిలా కనబడుతుంది. ఆ జాతర సెట్ ఫోటో ని రామ్ చరణ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. అలాగే సమంత ఆ జాతర లో నడిచొస్తున్న స్టిల్ కూడా ఇప్పుడు నెట్ లో వైరల్ అయ్యింది. ఇక రంగస్థలం జాతర సెట్ బొమ్మల కొట్లు, రంగుల రాట్నం, పల్లెటూరి జనంతో ఎంతో సందడిగా కనబడుతుంది.

1985 నాటి పల్లెటూరి ప్రేమ కథగా తెరకెక్కుతున్న ఈ సినిమా అచ్చంగా అలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నాడు దర్శకుడు సుకుమార్. ఇక రామ్ చరణ్ మాత్రం ఊర మాస్ లుక్ లో అదరగొడుతుంటే… సమంత మాత్రం అచ్చం పల్లెటూరి పడుచువలే లంగాఓణిలో ఆకట్టుకుంటుంది. ఇక ఈ చిత్రంలో ఆది పినిశెట్టి, అనసూయ లు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ జాతర సెట్ లోనే రంగస్థలానికి సంబందించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించింది చిత్ర బృందం.

ఈ రంగస్థలం సినిమా షూటింగ్ లో సమంత నిన్న సోమవారంనుండే జాయిన్ అయ్యింది. ఇప్పటివరకు పెళ్లి, రిసెప్షన్, గెట్ టు గెదర్ పార్టీలతో కాస్త బిజీగా ఉన్న సమంత.. ఇప్పుడు రంగస్థలం కోసం ఏకధాటిగా డేట్స్ ఇచ్చేసింది. ఇకపోతే రంగస్థలం చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుండగా.. రంగస్థలం బిజినెస్ మాత్రం అదిరిపోయే లెవల్లో జరుగుతుంది. ఇప్పటికే శాటిలైట్ రైట్స్ తోపాటు డిజిటల్ హక్కులు 20 కోట్లకు అమ్ముడు పోగా… ఇప్పుడు తాజాగా పదిన్నర కోట్లకు హిందీ రైట్స్ అమ్ముడు పోయినట్లుగా సమాచారం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*