సేమ్ అలానే ఉందంటున్నారు!!

అల్లు అర్జున్ గత కొన్ని రోజులుగా హిట్ ట్రాక్ లో వున్నాడు. ‘జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, రేసుగుర్రం, సరైనోడు’ చిత్రాలతో తానేమిటో నిరూపించుకున్న అల్లు అర్జున్ తాజాగా ‘డీజే… దువ్వాడ జగన్నాథం’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమా స్టార్ట్ అయినప్పడినుండే భారీ అంచనాలతో షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఈ సినిమాకి సంబంధించి ఇప్పటివరకు ఫస్ట్ లుక్ అంటూ టైటిల్ డిజైన్ మాత్రమే విడుదల చేశారు. కానీ అల్లు అర్జున్ లుక్ ని మాత్రం ఇప్పటిదాకా రివీల్ చెయ్యకుండా ఫిబ్రవరి 18 న డీజే అల్లు అర్జున్ లుక్ విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆ లుక్ ఇంకా విడుదల కాకముందే ప్రీ లుక్ అంటూ ఒక పోస్టర్ ని రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.

ఆ ప్రీ లుక్ లో ఏముందో తెలుసా… అందులో ఒక రుద్రాక్ష దారం, దేవుడి నామాలతో ఉంది. అంటే ఈ డీజే లో అల్లు అర్జున్ రెండు రోల్స్ లో నటిస్తాడని… అవి రెండు ‘అదుర్స్’ లో ఎన్టీఆర్ చేసిన పాత్రల మాదిరిగా ఒకటి బ్రాహ్మణుని పాత్ర మరొకటి యాక్షన్ కేరెక్టర్ అని మొదటి నుండి ప్రచారం జరిగినట్లు ‘అదుర్స్’ లుక్ ని పోలినట్లు ఈ రుద్రాక్ష, ఆ అడ్డ నామాలు ఉన్నట్లు ఉన్నాయని అంటున్నారు. మరి అల్లు అర్జున్ లుక్ విడుదలయ్యేవరకు ఈ చిత్రాన్ని ‘అదుర్స్’ తో పోల్చి చూడడం మానరేమో సినీజనాలు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*