సైరా లో పాత సినిమా సీనా?

సైరా ఎఫెక్ట్

చిరంజీవి సైరా నరసింహారెడ్డి సినిమాలో ఫైట్స్ చాలా కీలకం కానున్నాయి అంట. బాహుబలి రేంజ్ లో ఆ ఫైట్స్ ని ఉండబోతున్నాయి అని తెలుస్తుంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం గురించి ఎక్కువ సంగతులు ఏమి లేవు కానీ.. కాల్పనికత జత చేసి ఒక మంచి కమర్షియల్‌ కథని సిద్ధం చేసారట.

చిత్రంలో మొదటి ఫైట్ లో చిరంజీవి వంద మందిని చంపడం ప్రేక్షకులని థ్రిల్‌కి గురి చేస్తుందని చెబుతున్నారు. మగధీర సినిమాలో చరణ్ వంద మందిని చంపే సీన్ ఏ రేంజ్ లో ఉంటాదో అంతకు మించి ఈ సినిమాలో ఆ సీన్ ఉంటుందని తెలుస్తుంది. ఉయ్యాలవాడ క్లయిమాక్స్‌ ట్రాజడీ అయినా కానీ సినిమా అంతటా అతని హీరోయిజం ఎలివేట్‌ చేసే సన్నివేశాలు.

ఈ సినిమా మీద కాన్ఫిడెన్స్ తో, ఎంత ఖర్చు అయినా పర్లేదు అని చరణ్ సురేంద్ర రెడ్డి కి సూచించాడంట. అన్నట్టు సైరా ఫస్ట్‌ షెడ్యూల్‌ తీసిన తర్వాత సురేందర్‌పై మరింత అభిమానం పెరగడంతో, మల్లి చిత్రాన్ని తనతోనే చేయాలని చరణ్‌ మాట తీసుకున్నాడట.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*