'అఖిల్' పై అఖిల్ సంచలన వ్యాఖ్యలు!!
అక్కినేని అఖిల్ గ్రాండ్ లెవల్లో హీరో గా నటించిన తొలి సినిమా అఖిల్. మాస్ డైరెక్టర్ వినాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎంత భారీ ఫ్లాప్ ని మూటగట్టుకుందో అందరికీ తెలిసిన విషయమే. హీరోగా గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ ఈ 'అఖిల్' సినిమా కోలుకోలేని దెబ్బేసింది. అయితే అప్పటినుండి సైలెంట్ గా ఉన్న అఖిల్ ఇప్పుడు తన రెండో మూవీ అయిన 'హలో' మూవీ ప్రమోషన్స్ లో భాగంగా 'అఖిల్' సినిమా పై షాకింగ్ కామెంట్స్ చేసాడు. ఆ సినిమా గురించి అఖిల్ మాట్లాడుతూ… 'అఖిల్ సినిమా ఆడకపోవడం నిరాశ కలిగించింది. మానసికంగా చాలా దిగులు చెందాను. నిజానికి ఆ సినిమా ఫలితమేంటో ముందే అర్థమైపోయింది.
నా తప్పులు అర్థమయ్యేవి కావేమో...
అసలు ఒక విధంగా ఆ సినిమా ఆడకపోవడం మంచిదే అయింది. ఆ మూవీ హిట్ అయ్యి ఉంటే అదే తరహా కథలు చేసేవాడినేమో. నా తప్పులు అర్థమయ్యేవి కావు. అందరు హీరోలు చేసేదే వీడూ చేస్తున్నాడు అనే భావన ప్రేక్షకులకు కలిగేది. 'అఖిల్' ఆడకపోవడంతో నేనేం చేయాలో నాకర్థమైంది. 'హలో' లాంటి కొత్త తరహా కథను నేను ఎంచుకోవడానికి 'అఖిల్' ఫెయిల్యూరే కారణం....' అని చెప్పాడు అఖిల్. అలాగే 'అఖిల్' సినిమా డిజాస్టర్ అయినా సమయంలో తనకి తన అమ్మ అమల, నాన్న నాగార్జున అండగా నిలబడ్డారని.. ఆ మేలు ఎప్పటికి మర్చిపోలేనని కూడా చెప్పాడు.
22 న విడుదల...
ఇదిలా ఉంటే అఖిల్ తాజా చిత్రం 'హలో' సినిమా డిసెంబర్ 22 న గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. విక్రం కె కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా లో కళ్యాణి ప్రియదర్శిని హీరోయిన్ గా నటిస్తుంది. అక్కినేని నాగార్జున ఈ సినిమా ని ఎంతో జాగ్రత్తగా ఎక్కడ రాజీపడకుండా నిర్మించాడు.
- Tags
- అఖిల్