అజ్ఞాతవాసికి సెంటిమెంట్‌ను నమ్ముకున్న పవన్
జనసేన అధినేత, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఏం చేసినా సంథింగ్ స్పెషల్ అనే విధంగా ఉంటుంది. ఓ వైపు సినిమాలు..మరోవైపు రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్న పవన్ ఈ మధ్య లండన్ లో అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తన ఆప్తమిత్రుడైన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘అజ్ఞాతవాసి’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. మొదటి నుంచి సినిమాపై ఎలాంటి అప్ డేట్స్ ఇవ్వకుండా చాలా జాగ్రత్తలు పడుతున్నారు చిత్ర యూనిట్.
పవన్ పాట ప్రత్యేకం....
ఇక త్రివిక్రమ్ పుట్టిన రోజు సందర్భంగా ‘అజ్ఞాతవాసి’ సినిమా కు సంబంధించిన ఓ సాంగ్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఆ సాంగ్ సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది. ఇక తెలుగు ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్ అంటే ఎంత క్రేజ్ ఉంటుందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక పవన్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చే సినిమాలో ఓ సెంటిమెంట్ ఫాలో అవుతున్నారు..అదేంటో తెలుసా..! పవన్ కళ్యాణ్ స్వయంగా పాట పాడటం. గతంలో పవన్ తన సొంతగా పాడిన పాటలు విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నాయి.
ఇదే సెంటిమెంటా?
‘అత్తారింటికి దారేది’ చిత్రంలో కాటమ రాయుడా... కదిరి నరసింహుడా అంటూ అప్పట్లో పవన్ పాడిన పాట ఓ ట్రెండ్ సెట్ చేసింది. ప్రస్తుతం అలాంటి ప్రయోగమే మరో సారి త్రివిక్రమ్, పవన్ కలిసి అజ్ఞాతవాసి సినిమాలో చేయ బోతున్నారు. ఈ సారి పవన్ "కొడకా కోటేశ్వర రావా.." అంటూ ఫాన్స్ ని అలరించబోతున్నారు.ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నాడు. అయితే పవన్ అభిమానులు దీన్నొక సెంటిమెంట్‌గా భావిస్తూ పవన్‌కి బ్లాక్ బస్టర్ వచ్చినంత ఆనందంగా ఉన్నారు. సినిమా జనవరి 10న సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి రానుంది.
- Tags
- పవన్ కల్యాణ్