అనసూయ రెచ్చిపోయింది...!
సాయిధరమ్‌తేజ్ హీరోగా నటిస్తున్న 'విన్నర్'లోని ఒక్కోపాట విడుదలవుతూ, అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇక తమన్ అందించిన ట్యూన్స్ బాగా అలరిస్తున్నాయి. కాగా ఇందులో హాట్‌యాంకర్ అనసూయ చేసిన ఐటమ్‌సాంగ్‌కు సుమ హాస్క వాయిస్ తోడవ్వడంతో 'సూయ... సూయ.. అనసూయ' అనే పాట హుషారెక్కిస్తోంది. ఇంతకు ముందు కేవలం ఐటంసాంగ్ మాత్రమే అయితే చేయనని మంగమ్మ శపథం వేసిన అనసూయ ఈ ఐటంకు ఎందుకు ఒప్పుకుందా? అనేది ప్రస్తుతం చర్చనీయాంశం అయింది. కానీ ఈ పాట లిరిక్ ఆమె పేరుతోనే ప్రారంభం కావడం ఆమెను మెప్పిందని సమాచారం. ఇక ఈ ఐటంలో నటించినందుకు అనసూయకు ఏకంగా 25లక్షలు ఇచ్చారట. అనసూయకు 25లక్షలంటే పెద్ద మొత్తం కిందే లెక్క. ఇక ఈ పాటలో అనసూయతో పాటు కొందరు డ్యాన్సర్లు బుద్దుడి విగ్రహం ముందు అర్ధనగ్నంగా కనిపిస్తుండటంతో కొందరు సాంప్రదాయ వాదులు దానిపై విమర్శలు ఎక్కుపెట్టారు.
అనసూయ కూడా రంగంలోకి దిగి ఘాటుగా సమాధానం ఇచ్చింది. ఈ సాంగ్‌ను ఉక్రెయిన్‌లోని 'బుద్దబార్' అనే పబ్‌లో చిత్రీకరించాం. ఆ పబ్‌లో ఎప్పటి నుంచో బుద్దుని విగ్రహం ఉంది. దాన్ని కావాలని మేమే పెట్టలేదు. కావాలంటే గూగుల్‌కి వెళ్లి బుద్దబార్స్ గురించి సెర్చ్ చేయండి. ఈ బుద్దబార్ చెయిన్ గ్రూఫ్స్ గురించి తెలుస్తుంది అని క్లాస్ పీకింది. అంతటితో వదిలేయకుండా, అక్కడ బుద్దుడిని కొలిచి,పూజించేవారే ఆయన విగ్రహం ముందు తాగి, చిందులు వేస్తుంటారు. అలాంటిది అక్కడ మేము డ్యాన్స్ చేస్తే అభ్యంతరం మీకేమిటి? మా ఉద్దేశ్యం కేవలం ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడమే. ఎదుటి వారిని, మరీ ముఖ్యంగా కళాకారులను గౌరవించడం తెలియని ప్రజలకు, దేవుడి గురించి మాట్లాడే అర్హతేలేదని వ్యాఖ్యానించి, వార్తల్లోకి ఎక్కింది.