అబ్బో ఈ హీరోయిన్స్ ప్లాన్ భలే ఉన్నాయే
ఇప్పుడు హీరోస్ అయినా.. హీరోయిన్స్ అయినా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే.. కేవలం అందం, నటన, లక్కే కాదు దానికి తగ్గ పరిచయాలు చాలా అవసరం. అందుకే హీరోహీరోయిన్స్ వీలైనంత ఎక్కువమంది ఫ్రెండ్స్ ని మైంటైన్ చేస్తుంటారు. యూత్ స్టార్స్ అయితే మరీను. తమ సర్కిల్స్ లోని ఫ్రెండ్స్ తో కలిసి కొత్తకొత్త బిజినెస్ లు స్టార్ట్ చెయ్యడమే కాదు.... పార్టీలు పబ్బులు అంటూ తెగ చుట్టేస్తుంటారు. ఆ రకంగా టాలీవుడ్ లో చాలామంది స్టార్స్ ఉన్నారు. అందులో రకుల్, రవితేజ, రెజినా, నాగ చైతన్య, సమంత, రానా, విజయ్, అల్లు అర్జున్, శిరీష్, సాయి ధరమ్ తేజ, మంచు మనోజ్ లు ఇలా చాలామంది ఎక్కువగా ఫ్రెండ్స్ ని మైంటైన్ చేస్తుంటారు.
అయితే అందులో రెజినా, రకుల్ ప్రీత్ సింగ్ ల ఫ్రెండ్ షిప్ అందరిలో కాస్త స్పెషల్ అంట. అందుకే ఇప్పుడు ఒకరికొకరు సహాయం చేసుకుంటున్నారట. ఆ సహాయం ఏమిటా అని అనుకుంటున్నారా... అదేనండి రకుల్ ప్రీత్ సింగ్ ఢిల్లీ నుండి బాలీవుడ్ కి వెళ్లి అక్కడినుండి ఇక్కడ టాలీవుడ్ లోకొచ్చి సెటిలయ్యింది. మరి ఈ లెక్కనబాలీవుడ్ లో రకుల్ కి చాలా పరిచయాలున్నాయి. అందుకే రెజినా చెయ్యబోయే బాలీవుడ్ సినిమాల విషయంలో రకుల్, రేజీనా కి మాట సహాయం చేస్తుందట.
అక్కడ బాలీవుడ్ స్టార్స్ తో రెజీనా కి కంటాక్స్ పెంచే పనిలో రకుల్ ఉంటె... మరోపక్క రెజినా కూడా రకుల్ కి కోలీవుడ్ లో తనకున్న పరిచయాలను రకుల్ కి కూడా ఉపయోగపడేలా చేస్తుందట. మరి రెజినా బాలీవుడ్ రెండు సినిమాల వెనుక రకుల్ ఉన్నదని చెబుతున్న వాళ్ళే... రకుల్ కోలీవుడ్ లో సెట్ చేసి పనిలో రెజినా బిజీ అంటున్నారు. మరి వీరిద్దరూ కో స్టార్స్ అయినప్పటికీ ఒకరికొకరు చేసుకునే సహాయానికి మాత్రం హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.