అలాంటి పాత్రే కావాలంటే కష్టం అమ్మడు!
తొలిప్రేమ సినిమాతో డైరెక్టర్ వెంకీ అట్లూరి, హీరో వరుణ్ తేజ్ ల పేరు ఎంతలా మార్మోగిపోయిందో... వర్ష పాత్రలో మెరిసిన రాశి ఖన్నా పేరు కూడా అంతే మార్మోగిపోయింది. ఆమె మొదటి సినిమా ఊహలు గుసగుసలాడే సినిమాలో రాశి ఖన్నా ఎంత చక్కటి ప్రదర్శన చేసిందో... తొలిప్రేమలో కూడా అంతే చక్కటి ప్రదర్శన చేసింది. అందుకే రాశి ఖన్నా తొలిప్రేమలోని వర్ష పాత్ర పది కాలాలపాటు గుర్తుండిపోతుంది అని అంటున్నారు. ఊహలు గుసగుసలాడే సినిమాకి తొలిప్రేమ సినిమాకి మధ్యన రాశి ఖన్నా నటించిన చిత్రాలేమి ఆమెకి మంచి పేరు తీసుకురాలేదు. అలాగే అన్ని సినిమాల్లోనూ కాస్త మాస్ అండ్ రఫ్ గా ఉన్న పాత్రలనే రాశి ఖన్నా చేసింది.
అందుకే ఇకనుండి గ్లామర్ షోకి ఇంపార్టెన్స్ ఇచ్చేది లేదంటుంది. గతంలో గ్లామర్ తో ఆకట్టుకోలేని రాశి తొలిప్రేమలో నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలో గ్లామర్ చెయ్యక్కర్లేకుండానే మంచి మార్కులు కొట్టేసింది. అందుకే ఇప్పుడు గ్లామర్ పాత్రల కోసం చూడకుండా.. తొలిప్రేమలోని వర్ష లాంటి పాత్రలు చేస్తానని అంటోందట. అందుకే తనకి వచ్చిన ఒకటి, రెండు మాస్ సినిమా ఆఫర్లని కూడా రాశి ఇదే కారణమ్మీద వద్దనేసిందనే టాక్ వినబడుతుంది. అందులో భాగంగానే రాశి ఖన్నా కి నితిన్ సరసన శ్రీనివాస కళ్యాణములో వచ్చిన ఛాన్స్ ని ఒడిసి పట్టుకుందట.
మరి ఆ పాత్ర కోసం దిల్ రాజు బ్యాచ్ సాయి పల్లవిని ట్రై చేస్తే ఆమె... మాత్రం శ్రీనివాస కల్యాణంలో నటించనని చెప్పడంతో ఆ పాత్ర రాశి చేతికి వచ్చింది. ఇక ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నందిత శ్వేతా నటిస్తోంది. మరి రాశి ఖన్నాఅన్ని వర్షాలాంటి పాత్రలే కావాలంటే.... కొద్దిగా కష్టమే. ఎందుకంటే సినిమాల్లో వర్ష లాంటి నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు చాలా అరుదుగా తగులుతాయి. అలాంటిది అవే పాత్రలు కోసం రాశి భీష్మించుకుని కూర్చుంటే ఆమెకి అవకాశాలు తగ్గినా తగ్గొచ్చు.