అవకాశం ఒదులుకొదట
తమిళంలో స్టార్ హీరో స్టేటస్ వున్నా విజయ్ కి తుపాకీ, కత్తి వంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు ఏ.ఆర్.మురగదాస్ ఇప్పుడు తమ కాంబినేషన్ లో హ్యాట్ ట్రిక్ బ్లాక్ బస్టర్ కోసం రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. విజయ్ కి ఈ మధ్య కాలంలో వరుసగా పరాజయాలు పలకరిస్తున్నాయి. పులి, తేరి, భైరవ వంటి చిత్రాలకు తమిళనాడు రాష్ట్రంలో కూడా ప్రేక్షకాదరణ ఆశించిన స్థాయిలో దక్కలేదు. దానితో విజయ్ కూడా తనని సక్సెస్ ట్రాక్ లోకి తీసుకువచ్చేది మురగదాస్ చిత్రమే అని బలంగా నమ్ముతున్నాడు. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో బైలింగువల్ చిత్రం చేస్తున్న మురగదాస్ ఈ ఏడాది జూన్ 23 న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. తరువాత ఆయన విజయ్ చిత్రం పై పూర్తి దృష్టి కేంద్రీకరిస్తారు.
తెలుగు చిత్ర పరిశ్రమలోని అగ్ర కథానాయకుల జాబితాలో ఇప్పటికే రామ్ చరణ్ తేజ్, తారక్, అల్లు అర్జున్ ల సరసన నటించి విజయాలు అందుకున్న యంగ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ద్వారా మహేష్ బాబు సరసన తొలి సారి నటిస్తున్న సంగతి విదితమే. అయితే ఈ చిత్రం కోసం రకుల్ చూపుతున్న కమిట్మెంట్, డెడికేషన్ లెవెల్స్ తో మురగదాస్ ని బాగా ఆకట్టుకున్నట్టుంది రకుల్ ప్రీత్ సింగ్. మహేష్ బాబు చిత్రం అనంతరం తాను తమిళ్ లో తెరకెక్కించబోయే విజయ్ చిత్రానికి కూడా కథానాయికగా రకుల్ ని తీసుకోవటానికి ఫిక్స్ అయిపోయిన మురగదాస్ అందుకు అనుగుణంగా రకుల్ డేట్స్ అడగగా తమిళ్ లో స్టార్ హీరోయిన్ గా ఇప్పటి వరకు ఎస్టాబ్లిష్ కాలేకపోయిన రకుల్ ఈ అవకాశం కోల్పోకూడదు అని ఎంత కష్టమైనా మురగదాస్ అడిగిన సమయానికి కాల్ షీట్స్ సర్దుబాటు చేయటానికి ప్రయత్నిస్తోందట.