Fri Apr 19 2024 23:51:59 GMT+0000 (Coordinated Universal Time)
ఇక్కడ కూడా కిర్రాక్ పార్టీనే
యువనటుడు నిఖిల్ నటిస్తున్న తాజా చిత్రం టైటిల్ ఖరారైంది. ఆ చిత్రమే ‘కిర్రాక్ పార్టీ’ . కన్నడలో విజయవంతమైన ‘కిరిక్ పార్టీ’ రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నిఖిల్.. కృష్ణ అనే కాలేజీ కుర్రాడిగా కనిపించనున్నాడు. గత చిత్రం ‘కేశవ’తో రివెంజ్ డ్రామా కథని అందించిన నిఖిల్ ఈ చిత్రాన్ని యూత్ మాస్ ఎంటర్టైనర్ కథను అందిస్తున్నాడు. కన్నడ భామ సంయుక్త హెగ్డే , హిందీ భామ సిమ్రాన్ పరీనా ఈ చిత్రంలో కథానాయికలుగా నటిస్తున్నారు.
ఈ చిత్రం టైటిల్ , ఫస్ట్ లుక్ ను ఈరోజు శనివారం సాయంత్రం ట్విట్టర్ ద్వారా విడుదల చేశాడు కథానాయకుడు నిఖిల్. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై ఈ చిత్రాన్ని రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నాడు. శరన్ కొప్పిశెట్టి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ చిత్రానికి సుధీర్ వర్మ స్క్రీన్ ప్లే అందించగా.. చందూ మొండేటి మాటలను అందించాడు.
Next Story