ఎట్టకేలకు హీరో గారు అవతారం మార్చారు
గత నాలుగు సంవత్సరాలు గా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కేవలం బాహుబలి ప్రాజెక్ట్ కోసం తప్ప మరో సినిమా కోసం పని చేయలేదు. బాహుబలి రాజుల కథ కావటంతో కథానాయకుడైన ప్రభాస్ అందుకు తగ్గ విధంగా తన గెటప్ మరియు శరీరాకృతి మార్చుకున్నాడు. ఈ అవతారాలు ప్రేక్షకులకు నచినప్పటికీ మిర్చి విడుదల నాటి నుంచి ఇప్పటి వరకు ప్రభాస్ పొడవాటి జుత్తు, మెలి తిప్పిన మీసాలు, భారీగా పెరిగిన తన శరీరం తో కనిపించటంతో చూసి చూసి విసుగు వచ్చింది. డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి వంటి సినిమాలలో ప్రభాస్ స్టైలిష్ మరియు మోడరన్ లుక్స్ కి ప్రత్యేకమైన క్రేజ్ ఉండేది. ఇప్పుడు బాహుబలి ది కంక్లూషన్ పూర్తయిపోవటంతో ప్రభాస్ తన అవతారం లో తిరిగి ఆధునిక స్టైలింగ్ తీసుకు వచ్చాడు.
తాజాగా బాహుబలి ది బిగినింగ్ ట్రైలర్ లాంచ్ వేడుకలో ప్రభాస్ హెయిర్ స్టైల్, బాడీ షేప్స్ తోపాటు ట్రిమ్ చేసిన మీసాలు కూడా గత నాలుగేళ్లుగా మనం చుసిన ప్రభాస్ కి ఈ ప్రభాస్ ని పూర్తిగా భిన్నంగా చూపిస్తున్నాయి. వచ్చే నెలలో మొదలు కాబోతున్న ప్రభాస్ తదుపరి చిత్రం కోసం ఈ విధంగా ప్రభాస్ మారిపోయాడు. రన్ రాజా రన్ ఫెమ్ సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న జేమ్స్ బాండ్ తరహా సినిమా యు.వి క్రియేషన్స్ వారి బ్యానర్ పై నిర్మితం కానున్న సంగతి విదితమే. ఈ చిత్రం కోసం ప్రభాస్ తన శరీర బరువు ఇంకా తగ్గవలసి ఉండటంతో మరో నెల రోజుల సమయం తీసుకుని సెట్స్ పైకి సినిమా తీసుకెళ్లాలి అని ప్లాన్ చేస్తున్నాడట ప్రభాస్. చిత్రీకరణ ప్రారంభం కాకముందే ఈ సినిమా బడ్జెట్ పై ఎన్నో ఊహాగానాలు వెలువడుతున్నాయి. మొత్తానికి భారీ బడ్జెట్ గా తెరకెక్కనున్న ఈ మల్టీ లాంగ్వేజ్ ఫిలిం బాహుబలి తో ప్రభాస్ కు పెరిగిన మార్కెట్ స్టామినా ని ప్రూవ్ చేయబోయే చిత్రం కాబోతోంది
- Tags
- ప్రభాస్