Wed Apr 24 2024 14:49:25 GMT+0000 (Coordinated Universal Time)
ఐటెం కి ఒకే చెప్పిందట!!
బుల్లితెరమీద హాట్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న అనసూయ మెల్లగా వెండితెరమీద కూడా కాలు పెట్టింది. అక్కడ కూడా సక్సెస్ అయ్యింది. అయితే అనసూయ రేంజ్ పాత్రలైతే ఆమె తలుపు తట్టలేదు గాని చిన్న చితక కేరెక్టర్స్ తో ఆమె సినిమాల్లొనెట్టుకొస్తుంది. ఆమె బుల్లితెర మీద అందాల ఆరబోతలో ఒక కొత్త ఒరవడికి నాంది పలికింది. అదే ఊపులో ఆమెకు గతం లో ఐటెం సాంగ్ చేసే అవకాశం వచ్చిందని..... కానీ దానికి అనసూయ ఒప్పుకోలేదని రూమర్స్ వచాయి. దానికి అనసూయ కూడా స్పందించింది. అలాంటి ఆఫర్స్ ఏమి తనకు రాలేదని చెప్పింది.
కానీ ఆమెని చాలామంది దర్శకులు ఐటెం సాంగ్స్ లో నటించమని అడగగా ఆమె అందరికి నో చెప్పేసింది టాక్ బయటికి వచ్చింది. ఇక తర్వాత నాగార్జున సినిమాలో చిన్న రోల్, క్షణం చిత్రం లో ఫుల్ లెంత్ రోల్ చేసిన అనసూయకి అవకాశాలు పెద్దగా రాలేదనే చెప్పాలి. ఆమె క్షణం చిత్రం విడుదలైన దగ్గర నుండి మళ్ళీ వెండితెర మీద కనబడలేదు. కానీ బుల్లితెర మీద బాగానే బిజీ అయ్యింది. అయితే వెండితెర మీద అవకాశాల కోసం ఆమె హాట్ హాట్ ఫోటో షూట్స్ చేయించుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కానీ తగిన రెస్పాన్స్ అయితే రాలేదు. అయితే ఇప్పుడు అనసూయ మీద ఒక ఇంట్రస్టింగ్ న్యూస్ ఒకటి బయటికి వచ్చింది. అదేమిటంటే ఐటమ్స్ సాంగ్స్ లో చెయ్యనని కరాఖండిగా చెప్పిన అనసూయ ఇప్పుడు ఐటెం సాంగ్ లో ఆడిపాడడానికి రెడీ అయ్యిందట. ఆమె సాయి ధరమ్ తేజ చిత్రం విన్నర్ లో ఐటెం చెయ్యడానికి ఒప్పుకుందని సమాచారం.
ఇప్పటికే అనసూయను విన్నర్ చిత్రం లో ఐటెం సాంగ్ కోసం ఎంపిక చేసినట్లు వార్తలొస్తున్నాయి. ఇక ఈ సాంగ్ చెయ్యమని అనసూయని ఒప్పించడానికి పెద్ద మొత్తం లో ముట్టజెబుతున్నారని టాక్. మరి ఇప్పటిదాకా ఐటమ్స్ చెయ్యనని భీష్మించుకుని కూర్చున్న అనసూయ కేవలం డబ్బు కోసమే ఇప్పుడు ఐటెం లో నటించడానికి ఒప్పుకుందని ప్రచారం మొదలైంది.
Next Story