ఒక్కరోజు కలెక్టర్గా ఏం చేయవచ్చునంటే...
కోలీవుడ్లో సూర్య, కార్తీ, విజయ్ వంటి అగ్ర హీరోల స్థాయి స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేస్తున్న ఏకైక కథానాయిక నయనతార. ఇటీవలి కాలంలో తెలుగులో విక్టరీ వెంకటేష్ సరసన బాబు బంగారం, తమిళం లో పలు హీరోల సరసన నటించినప్పటికీ నయన్ హీరోయిన్ ఓరియెంటెడ్ కథలను ఎక్కువగా ఒప్పుకుంటుంది. ప్రస్తుతం తమిళంలో తెరకెక్కితున్న ఆరమ్ చిత్రం పూర్తిగా నయనతార పాత్ర చుట్టూనే తిరుగుతుంది అంట. ఆలా అని నయన్ పాత్ర గ్రాండ్ గా తెరకెక్కించటం కూడా జరగటం లేదు. నయనతార ఈ చిత్రం మొదలు నుంచి పూర్తి అయ్యే వరకు ఒకే చీరలో దర్శనమివ్వనుంది. కాస్ట్యూమ్ చేంజ్ కి స్కోప్ కూడా లేదట.
కోలీవుడ్ లో మింజురు గోపి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆరమ్ చిత్రం మొత్తం ఒక ఉదయం మొదలై అదే రోజు రాత్రికి ముగిసిపోయే కథ. జిల్లా కలెక్టర్ పాత్ర పోషిస్తున్న నయన్ ఒక గ్రామానికి వచ్చిన నీటి సమస్య పరిష్కారానికై ఆ గ్రామం చేరుకొని అదే రోజు ఆ సమస్య పరిష్కరిస్తుంది. ఈ క్రమంలో ఆ గ్రామంలో ఆవిడకి ఎదురైన అతి అరుదైన సందర్భాల చుట్టూ కథనం నడుస్తుంది అని సమాచారం. ఒకే రోజు జరిగిన కథ కావటంతో నయన్ చిత్రం మొత్తం ఒకే చీరతో కనిపిస్తారు. ఆరమ్ చిత్రీకరణ దాదాపు పూర్తి అయిపోయింది అని, కొన్ని ప్యాచ్ వర్క్స్ బాకి ఉన్నట్టు తాజాగా దర్శకుడు మంజూరు గోపి ప్రకటించారు. తమిళంలో ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. మరి తెలుగు లోకి అనువాదమయ్యే అవకాశాలు వున్నది లేనిదీ ఇప్పటి వరకు చిత్ర బృందం నుంచి ఎటువంటి ప్రకటన వెలువడలేదు.
‘ఒక్కరోజు ముఖ్యమంత్రి ’ గా అయితే ఒక నిజాయితీ పరుడైన వ్యక్తి ఏం చేయగలడో ‘ఒకే ఒక్కడు’ చిత్రంలో అర్జున్ నిరూపించాడు. ఇప్పుడు నిజాయితీ గల అధికారి.. ఒక రోజులో ఏం చేయగలదో నయనతార చాటి చెపుతుందన్నమాట.